తిరుపతి ఉప ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే వైసీపీకి షాక్ ఇవ్వనున్నాడా..?

ycp

 ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికల వేడి రాజుకోబోతుంది. తిరుపతి ఎంపీ బల్లికురవ దుర్గాప్రసాద్ చనిపోవటంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీనితో ఎన్నికల్లో పోటీచేసి తమ సత్తా ఏమిటో చూపించాలని టీడీపీ, ఏపీ లో తమకు బలమైన మద్దతు ఉందని నిరూపించుకోవాలని బీజేపీ జనసేన తహతయలాడుతున్నాయి. ఇదే సమయంలో అధికార వైసీపీ మాత్రం విజయం కంటే కూడా వచ్చే మెజారిటీ మీదే ఎక్కువగా దృష్టి పెట్టటం చూస్తుంటే ఆ పార్టీ కాన్ఫిడెన్స్ ఏమిటో తెలుస్తుంది.

anam ramnarayana reddy

 ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వచ్చిన ఢోకా ఏమి లేదు. ప్రజారంజిక పాలన అందిస్తూ, ప్రతినెలా ఎదో ఒక రూపాన జనాల అకౌంట్ లోకి డబ్బులు వేస్తూ, ఎలాంటి అక్రమాలు జరగకుండా జగన్ పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం ఖాయమని వైసీపీ భావిస్తుంది. అయితే దానిని భారీ విజయంగా మలుచుకోవాలని చూస్తుంది. అయితే ఈ క్రమంలో తిరుపతి పరిధిలోని ఏడూ అసెంబ్లీ నియోజవర్గాల వారీగా చూసుకుంటే వైసీపీ పార్టీకి కొంచం వ్యతిరేక గాలి వీస్తుంది.

 దానికి ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల పనితీరు అనే తెలుస్తుంది. ముఖ్యంగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం కొంచం తేడాగా ఉంది. ఆనం సీనియర్ నేతైనా కానీ, ఆయనకు తొలి ధపాలో మంత్రి పదవి రాలేదు. రెండో ధపాలో కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. దీనితో ఆయన బాగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఉప ఎన్నికల సమయంలో ఎంత వరకు పార్టీకోసం కష్టపడతాడు అనేది అనుమానంగా మారింది.

అయితే ఆ నియోకవర్గంలో వైసీపీ తరుపున ద్వితీయ శ్రేణి నాయకులు గట్టిగా ఉండటంతో ఆనంకు పార్టీ కోసం పనిచేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. రాంనారాయణ రెడ్డి కొంచం వెనక్కి తగ్గినా కానీ ఆ స్థానాన్ని ఆక్రమించుకోవటానికి అనేక మంది నేతలు సిద్ధంగా ఉన్నారు. పార్టీ అధిష్టానం కూడా అలాంటి నేతలను గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. మరోపక్క సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి కి మొదటి ధపాలో మంత్రి పదవి రాకపోవటంతో ఆయన కూడా పార్టీమీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రెండో ధపాలో మంత్రిపదవి ఖాయమనే మాటలు రావటంతో తిరుపతి ఉప ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేయాలనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.