మంది ఎక్కువైతే మఠానికి చేటు.. దాని పేరే జనాభా కాటు.. అభివృద్ధిపై వేటు….!
జగతి జనాభా ఎనిమిది వందల పన్నెండు కోట్లు.. ఆ మొత్తంలో మన వాటా నూట నలభై నాలుగు.. ప్రతి పల్లె.. పట్టణం.. జనారణ్యం.. ప్రగతి కీకారణ్యం..!
జనాభా పెరుగుతూ ఉంటే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని పేరు గొప్ప ఊరు దిబ్బని.. ఇసకేస్తే రాలని జనం.. మసకేస్తే ఇంకెక్కడి పురోగ”మనం”..!
చైనాని మించి ప్రభం”జనం”.. ఇప్పుడక్కడ పెరుగుదల తిరోగమనం.. మనకిక్కడ పట్టేపట్టని నియంత్రణ… పెరుగుతున్న జనగణన.. ఊరూరా జనాల కవాతు.. ఉచితాలు ఇలా ఇస్తూ పోతే అభివృద్ధికి నిధులెక్కడ..!
నీ పుట్టుక ఇంటికి పండగే.. నువ్వు పనికిరాకుండా పోతే దేశానికి దండగే..!! 🫢🫢🫢🫢🫢🫢🫢
జనాభా దినోత్సవం సందర్భంగా.. సురేష్ కుమార్