ఓట్ల లెక్కింపు ఇంకా తేలవడం లేదు. ఓట్ల ప్రక్రియ అమెరికాలో ముందుకు సాగే కొద్ది కొద్ది మ్యాజిక్ ఫిగర్ కు బైడెన్ దక్కర అవుతున్నారు. అమెరికా వ్యాప్తంగా నిరసనల హోరు ఒక వైపు, కోర్టు కేసులు మరొక వైపు నడుస్తున్నాయి. అయితే ఎన్నో రకాల వర్గాలతో నిండిన అమెరికా సమాజం వేసిన ఓట్ల సరళిని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్లను సింపుల్ గా విశ్లేషించుకుంటే… గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ట్రంప్ వైపు ఆసక్తి కనబరిస్తే, అర్భన్ ఓటర్లు బైడెన్ కు జై కొట్టారు. ట్రంప్ పోటీ చేసిన రిపబ్లికన్ పార్టీ గ్రామీణ ప్రాంతంలో ప్రభావం చూపిస్తే … బైడెన్ ను బరిలో నిలిపిన డెమొక్రటిక్ పార్టీకి నగరాల్లో మంచి ఆదరణ లభించింది.
కిందటి సారి ట్రంప్ కు ఓటేసిన గ్రామీణ ఓటర్లు ఈ సారి కూడా ట్రంప్ కే ఓటేశారు. గ్రామీణ జనాభా అత్యధికంగా ఉండే గ్రాండ్ జంక్షన్ (కొలరాడో రాష్ట్రం), కొలరాడో స్ర్పింగ్స్ , మెసా కౌంటీ(కొలరాడో), ఎల్ పాసో కౌంటీ (టెక్సాస్ రాష్ట్రం)లు డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ఓటేశాయి.
కొలరాడో రాష్ట్రంలో మొత్తం 64 కౌంటీలు ఉండగా ఈ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లోని 26 కౌంటీలు ఉన్నాయి. ఈ కౌంటీలన్నీ బైడెన్ వైపే మొగ్గు చూపాయి. వీసాల జారీ, వలసదారుల చట్టాలు వంటి అంశాల్లో బైడెన్ మితవాద వైఖరి అవలంభిస్తారనే ఆశతో ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన స్థిరపడ్డ ఓటర్లు బైడెన్ కు పెద్ద సంఖ్యలో ఓటేశారు. ఇక ముఖ్యంగా దక్షిణాసియా మూలాలున్న భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీచేయడం బైడెన్‌కుబాగా కలిసొచ్చందని సమాచారం. కిందటి ఎన్నికలతో పోల్చితే అమెరికాలో ముస్లింల ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఏకంగా 78 శాతం వృద్ధి కనబరిచింది. వీరిలో మెజార్టీ ఓటర్లు బైడెన్ కు ఓటేశారని తెలుస్తోంది. 2016తో పోలిస్తే ఈసారి హిస్పానిక్ ఓట్లను ఆకర్శించడంలో ట్రాంప్ సక్సెస్ అయినా అధ్యక్ష పదవిని ఈ ఓట్లు అందించలేకపోయాయి.