కికి ఛాలెంజ్ గురించి చర్చ నడుస్తుండగానే మరో ప్రాణాంతక గేమ్ సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపిస్తోంది. ఆ కొత్త గేమ్ పేరు ”మోమో ఛాలెంజ్”.గతేడాది వందలాది మంది ప్రాణాలను బలికొన్న ‘బ్లూవేల్ ఛాలెంజ్’ తరహాలోనే ఈ కొత్త గేమ్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.ఈ డెడ్లీ గేమ్ బారిన పడి ఇప్పటికే ఒకరిద్దరు మృత్యువాత పడటం మరింత భయం రేకెత్తిస్తోంది.యూకే,మెక్సికో,ఆర్జెంటినా ,ఫ్రాన్స్ ,జర్మనీ దేశాల్లో ఈ గేమ్ విస్తృతమవుతోంది.ప్రత్యేక లింక్ ల ద్వారా వేగంగా వ్యాపిస్తున్న మోమో ఛాలెంజ్ భరత్ లోను అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు.
మోమో గేమ్ లో భాగంగా ‘బ్లూవేల్’ తరహాలో కొన్ని టాస్కులు చేయాల్సి ఉంటుంది.అందుకు సంబంధించిన లింక్ ‘మోమో’ ప్రొఫైల్ పిక్ ఉన్న ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి వస్తుంది.వారిచ్చిన పనిని పూర్తి చేయాలనీ ఆదేశాలు అందుతాయి. ఆ పని పూర్తి చేసి మోమో గేమ్ లో భాగంగా సోషల్ మీడియాలో దాన్ని అప్ లోడ్ చేయాలి. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కొత్త కొత్త నంబర్ల నుంచి భయంకరమైన వీడియోలు పంపడం,బెదిరింపులు రావడం మొదలవుతాయి.
ఏమిటి ‘మోమో’?
భయంకరమైన శరీర ఆకృతి ,పెద్ద పెద్ద కళ్ళతో ఉన్న ఓ విచిత్ర ఆకారం పేరే ‘మోమో’ .జపాన్ కు చెందిన ఓ స్పెషల్ ఎఫెక్ట్ కంపెనీ ఈ ఆకారాన్ని రూపొందించింది.అయితే ఆ కంపెనీకి ఈ గేమ్ కు ఎలాంటి సంబంధంలేదు.కొంత మంది హ్యాకర్లు ఈ ఆకారాన్ని వాడుకొని మోమో ఛాలెంజ్ రూపొందించినట్లు అనుమానిస్తున్నారు.ఫేస్ బుక్ ,వాట్సాప్ ,యూట్యూబ్ వేదికగా ఈ గేమ్ ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఆర్జెంటినాలో ఓ చిన్నారి ఈ ప్రాణాంతక గేమ్ కు బాలవ్వడంతో దీని గురించి చర్చ మొదలైంది.
ఎవరు చేస్తున్నారు?
అసలు ఈ ‘మోమో’ను ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? అనే వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీని వెనుక ఉన్నవారు మాత్రం ఎక్కువగా టీనేజ్ యువతీకులనే లక్యంగా చేసుకొని వలలో వేసుకుంటున్నారు. గేమ్ లో ముందుగా …మెమోను కాంటాక్ట్ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్ ఇచ్చి..మెసేజ్ పంపుతూ చాట్ చేయాలంటూ ఛాలెంజ్ విసురుతారు.దానికి స్పందించడం మొదలుపెడితే పలు పనులు పూర్తి చేయాలంటూ వరసగా టాస్కులు వస్తాయి. వీటిలో ఎక్కువగా స్వీయ హాని చేసుకునేవే ఉంటాయి.
ఛాలెంజ్ పూర్తి చేయకపోతే ఏమవుతుంది?
మోమో సవాల్ అందుకొని ఛాలెంజ్ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయి.భయానక చిత్రాలు,హింసాత్మక సందేశాలతో మెసేజ్ లు పెడుతున్నారు.ఇప్పటి వరకు ఇలాంటి మెసేజ్ లు ఓ ఏడు నంబర్ల నుంచి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పిల్లలు ఏం చేయాలి?
- తెలియని నంబర్ల నుంచి మెసేజ్ లు వస్తే స్పందించకూడదు.
2. కొత్త నంబర్లకు మెసేజ్ లు పంపొద్దు
3. తోటి స్నేహితులు చేస్తున్నారు కదా అని గుడ్డిగా వారి బాటలో వెళ్ళకూడదు.
4. తేడా అనిపిస్తే వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి