వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త.. ఇకపై ఆ ఫోటోలను సులువుగా స్క్రీన్ షాట్ తీయలేరట!

మన దేశంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆఫీస్ వర్క్స్ కోసం కూడా దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. అయితే యూజర్ల ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వాట్సాప్ తాజాగా మరో షాకింగ్ నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఇప్పటికే వాట్సాప్ చాట్ లాక్, అన్ కోన్ కాల్ బ్లాకింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ కొత్తగా స్క్రీన్ షాట్ బ్లాక్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురాగా ప్రస్తుతం ఈ ఆప్షన్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని వాట్సాప్ సంస్థ నుంచి సమాచారం అందుతోంది. వాబీటా ఇన్ఫో తన బ్లాగ్ లో ఈ విషయాలను వెల్లడించింది. వాట్సాప్ లో ఇప్పటికే ప్రైవసీ ఫీచర్ ను వినియోగించి నచ్చిన వాళ్లు మాత్రమే ప్రొఫైల్ పిక్చర్ ను చూసే ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది.

కొంతమంది ప్రొఫైల్ పిక్ ను స్క్రీన్ షాట్ తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరహా రిస్క్ లను తగ్గించాలనే ఆలోచనతో వాట్సాప్ ఈ దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఎవరి ప్రొఫైల్ ఫోటోనైనా స్క్రీన్ షాట్ తీయాలని భావించే వాళ్లు ఇకపై వాటిని తీయడం సాధ్యం కాదు. వాట్సాప్ గతంలో ప్రొఫైల్ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ అందించేది.

ఇప్పటికీ కొన్ని ఆప్షన్ల ద్వారా ప్రొఫైల్ ఫోటోను డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఫేస్ బుక్ లో గతంలోనే ఇలాంటి ఆప్షన్ ఉండగా వాట్సాప్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.