Sreeleela: టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీ లీలా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే శ్రీ లీలా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి నటించిన మూవీ జూనియర్. ఈ సినిమా విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ సినిమాతో ఒకేసారి కన్నడ, తెలుగు, తమిళ ఆడియన్స్ ను పలకరించనున్నాడు కిరిటీ.
మొదటి సినిమా అయినప్పటికీ జూనియర్ మూవీపై భారీ అంచనాలు నెల కొన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ మూవీ క్యాస్టింగ్. అలాగే ఎంతో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగమయ్యారు. జూనియర్ సినిమాలో కిరిటీ రెడ్డి పక్కన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు సినీ అభిమానుల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. లేటెస్ట్ గా జూనియర్ నుంచి రెండో పాట విడుదలైంది. వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును అంటూ సాగే ఈ సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఇక శ్రీలల అంతా కాకపోయినా కిరిటీ రెడ్డి కూడా బాగానే స్టెప్పులేశాడని సినీ ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ వయ్యారి పాట అన్ని భాషలలో కలిపి 6 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. కాగా ఈ పాట కిస్సిక్ సాంగ్ ని మించి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ ని సృష్టిస్తోంది.

