విజయవాడలో రోడ్డుకి అడ్డంగా కూలిన భారీ వృక్షం..(వీడియో)

విజయవాడ అరండల్ పేటలో భారి వృక్షం ఒక్కసారిగా విరిగిపడింది. ఈ సంఘటన జరిగిన సమయంలో అటుగా ఎవరు వెళ్ళక పోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. వంద సంవత్సరాల కు పైగా వయసు ఉన్న చెట్టు కావడం కాండం బాగా దెబ్బతినడంతో కూలిపోయిందని స్ధానికులు చెపుతున్నారు. ఈ సంఘటనలో అక్కడే నిలిపి ఉన్న ఐదు ద్వి చక్రవాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.