రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో తెలంగాణాకి మంచి లీడర్ అయిన కొండా మురళి చరిత్రను వర్మగారు సినిమాగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది వర్మగారి ఆలోచన. అయితే, గతంలో ఇలాగే చాలా సినిమాలను వర్మ అనౌన్స్ చేసి వదిలేసిన సంగతి తెలిసిందే.
అప్పుడెప్పుడో శశికళ మీద సినిమా అన్నాడు.. కేసీఆర్ మీద సినిమా అన్నాడు.. వాటి స్టేటస్ ఏంటనేది ప్రస్తుతానికి అప్రస్తుతం అనుకోండి. ఏదైనా పార్టీ నుంచి ప్యాకేజీ వస్తే, వర్మ గారి సినిమా కథ అప్పటికప్పుడు ఆ పార్టీ మీదకి ఈజీగా షిఫ్ట్ అయిపోతుంటుంది. రాత్రి మాట్లాడిన మాట తెల్లారేసరికి గుర్తుండదు కర్మ.. మన వర్మగారికి. ఇకపోతే, లేటెస్ట్ అప్‌డేట్ విషయానికి వస్తే, తెలంగాణాలో రాబోయే ఎలక్షన్స్‌ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు వర్మ. హుజూరాబాద్ ఎలక్షన్స్‌లో కొండా సుజాత పోటీ చేయబోతోందన్న గుసగుస వర్మగారి చెవిన పడినట్లుంది. అంతే, అటువైపుగా తన దుకాణం సర్దేశాడు. ‘కొండా’ అనే టైటిల్ అనౌన్స్ చేసేసి, తన స్టైల్ ఆఫ్ పబ్లిసటీ హడావిడి స్టార్ట్ చేసేశాడు. చూడాలి మరి, ఈ నయా రక్త చరిత్రతో వర్మ ఎంత మేర పబ్లిసిటీ వెనకేసుకుంటాడో.