వైసీపీలో రెడ్డి సామాజికవర్గం నేతలు హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పార్టీలో తమది ప్రత్యేక స్థానమని, తమకు సపరేట్ హక్కులు ఉన్నాయన్నట్టు ఉంటున్నారు కొందరు నేతలు. ముఖ్యంగా రాయలసీమకు చెందిన ఒక సీనియర్ లీడర్, మంత్రి సీఎం తర్వాత సీఎం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. జగన్ వద్ద ఎవరి మాట చెల్లిన చెల్లకపోయినా ఈయన మాట చెల్లి తీరుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ముఖ్యమంత్రితో ఫేస్ టూ ఫేస్ మాట్లాడగల వ్యక్తి ఆయన. ఈయన డామినేషన్ భరించలేక సీమకు చెందిన ఇద్దరు లీడర్లకు ఊపిరాడట్లేదు. ఫైర్ బ్రాండ్స్ అనే పేరున్నప్పటికీ సదరు మంత్రివర్యుల మూలాన పదవులు దక్కించుకోలేక సైలెంట్ అయిపోయారు.
అయితే ఈ డామినేషన్ రాయలసీమను దాటి బెజవాడ చేరుకుందని టాక్. సదరు మంత్రి బెజవాడలో కూడ పార్టీని కంట్రోల్ చేయాలని చూస్తున్నారట. విజయవాడ రాజకీయ వ్యవహారాలను చూస్తున్న నాయకుడు కూడ రెడ్డి వర్గం వారే కావడం, జగన్ కు సమీప బంధువు కావడంతో రాయలసీమ రెడ్డిగారి ఎఫెక్ట్ బెజవాడ మీద స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయంగా రాష్ట్రంలో బెజవాడకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ నిలదొక్కుకోగలిగితే రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చనే సెంటిమెంట్ ఉంది. అందుకే విజయవాడ నుండి గెలుపొంది మంత్రులయ్యే నాయకులకు సపరేట్ ఇమేజ్ ఉంటుంది. ప్రస్తుతం విజయవాడ నుండి మంత్రిగా ఉన్న లీడర్ ఈ ఇమేజ్ ను ఒడిసిపట్టాలని చూస్తున్నారు.
కానీ రాయలసీమ పెద్దాయన ఈయనకు ఆటంకంలా మారారట. బెజవాడ పార్టీ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తానే తీసుకోవాలని, తాను చెప్పినట్టే అక్కడి నాయకులు నడుచుకోవాలని సంకేతాలిస్తున్నారట. ఇది బెజవాడ మంత్రికి మిగుడుపడట్లేదు. తాము సీమ రాజకీయాల్లో జోక్యం చేసుకోనప్పుడు సీమ నాయకులు బెజవాడలో పెత్తనం చేయాలని చూడటం ఏమిటని మండిపడుతున్నారట. ఆ ఫ్రస్ట్రేషన్లోనే తాజాగా రేగిన పెద్ద వివాదంలో విపరీతంగా మాట్లాడేసి వివాదాస్పదమయ్యారని, తాను కూడ తక్కువేమీ కాదని నిరూపించుకునే ప్రయత్నంలో విమర్శలకు గురవ్వుతున్నారని టాక్ నడుస్తోంది. మరి రాయలసీమ వెర్సెస్ బెజవాడ అన్నట్టు తరయారవుతున్న ఈ పోరు అక్కడికి దారితీస్తుందో.