శ్రీకాకుళేశ్వర స్వామి గుడిలో హరికృష్ణ

రెండేళ్ల కిందట అంటే 2016, డిసెంబర్  27న  నందమూరి హరికృష్ణ కృష్ణా జిల్లా పర్యటన లో ఉన్నపుడు  ఘంటసాల మండలం శ్రీకాకుళేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 

ఆలయం చాలా చరిత్రగల ఆలయమని అందుకే స్వామివారిని దర్శనం చేసుకుంటానికి వచ్చానని ఆయన చెప్పారు.

ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని అంటూ చాలా సేపు అక్కడ గడిపారు. 

తెలుగు బాషా పై మక్కువ ఉన్న హరికృష్ణ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణదేవరాయలవారు విగ్రహము చూసి చాలా సంతోషించారు. ఈ విగ్రహంలో ఆయన తన తండ్రిని చూసుకున్నారు.  ఈ విగ్రహం చూస్తుంటే  అచ్చం నాన్నగారిని చూసినట్టే ఉందని వ్యాఖ్యానించారు. 

ఆ ఫోెటో లు ఇవి.