పాపం… నందమూరి సుహాసిని!

ఏపీలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందా.. గతంలో వచ్చిన 23 కంటే ఎక్కువ స్థానాల్లో గెలవబోతోందా.. ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ పెట్టుకున్న లక్ష్యం “వైనాట్-175” ని తుత్తినీలు చేయాలని భావిస్తుందా.. అవసరమైతే బీజేపీ – జనసేనలను వెంటేసుకునైనా పోరాడాలనుకుంటుందా.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. దీంతో… ఇప్పటికే జనసేనను గతంలో చేసినంతగా ఎంటరై టైన్ చేయకుండా స్టాండ్ బై గా పెట్టుకున్న బాబు.. బీజేపీకి గాళం వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… సీట్లు సర్ధుబాటు కావనో.. లేక, గెలిచే చోట నందమూరి వారసులకు ఛాన్స్ లేదనో తెలియదు కానీ… మరోసారి నందమూరి ఆడపడుచుకి హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు.

అవును… ఇంతకాలం వెంటిలేటర్ పై ఉన్న టీడీపీకి.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గొప్ప బూస్ట్ ఇచ్చాయనేది తెలిసిన విషయమే. అప్పటినుంచి కాస్త ఆశలు పెంచుకున్న బాబు… సైకిల్ బయటకు తీసి జిల్లా టూర్ లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో… నిన్నమొన్నటివరకూ నందమూరి వారసులను ఏపీలో తిప్పుతూ.. జనాలను పోగేసుకున్న బాబు… ఇప్పుడు సభలకు నలుగురు జనాలు వచ్చి, రాబోయే ఎన్నికల్లో 23కంటే ఎక్కువ సీట్లొస్తాయని కథనాలు రాగానే… వారిని మరోసారి తప్పించేస్తున్నారు.

అందులో భాగంగా… నందమూరి సుహాసినికి షాకిచ్చారు బాబు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినపుడు.. ఆయన వెన్నంటి ఉండి.. తొమ్మిది నెలల పాటు ఉమ్మడి ఏపీ అంతా చైతన్య రథానికి రధసారథిగా పనిచేసిన నందమూరి హరిక్రిష్ణ కుమార్తెకు మరోసారి ఏపీలో సీటు లేదని తెలంగాణకు పంపించేశారు చంద్రబాబు.

2018లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి పోటీకి దిగి.. బాబు రాజకీయాలకు బలైపోయిన బలైపోయిన సుహాసిని… ఈసారి ఏపీలో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా… గుడివాడ, లేక గన్నవరం సిట్లలో టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆమె భావించారు! అయితే… కమ్మ సామాజిక వర్గానికి, తెలుగుదేశం పార్టీకి మరింత బలమున్న చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నందమూరి అభిమానులు కోరారు. దీంతో… రాబోయే ఎన్నికల్లో ఆమె ఏపీ నుంచి పోటీచేస్తారని.. ఫలితంగా పాజిటివ్ ఫలితాలు పొందుతారని, చట్టసభల్లో హరికృష్ణ వారసురాలు అడుగుపెడుతుందని అంతా ఆశించారు.

అయితే… ఇంతలోనే ఏమి జరిగిందో, సీట్ల సర్ధుబాటులో సుహాసిని బలైందో.. లేక, ఏపీలో గెలిచేలా పరిస్థితులు ఉన్నాయని భావిస్తూ… ఇక్కడ నందమూరి వారసులు వద్దని బాబు ఫిక్సయ్యారో తెలియదు కానీ… రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పదవి అంటూ… ఆమెను తెలంగాణ పంపించేసారు బాబు! అసలు తెలంగాణలో టీడీపీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చంద్రబాబుకు తెలియంది కాదు. అక్కడకు వెళ్లి, పార్టీని బలోపేతం చేసి, ఆమె ఎప్పటికి ఎన్నికవ్వాలి, ఎప్పటికి చట్టసభల్లోకి అడుగుపెట్టాలి. చంద్రబాబా… మజాకా?

దీంతో… నందమూరి అభిమానులు మరోసారి బాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ ఫ్యామిలీపై బాబు అక్కసు ఇంకా అలానే ఉందని ఆవేదన చెందుతున్నారు. నందమూరి వారసుల్లో మగాళ్లకు ఎలాగూ బయపడతారు… ఆడపడుచుకులకు కూడా లోకేష్ విషయంలో భయపడటం కరెక్ట్ కాదని సూచిస్తున్నారు.