అమరావతిలో డ్రైవర్ సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి లో డిజీపి ఆఫీసుకు కూత వేటు దూరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఖాళీ పెట్రోల్ ట్యాంకర్ లారీని  ఆటో ఢికొట్టింది. దీంతో లారీలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.లారీలో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. క్లీనర్ కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టు పక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

ట్యాంకర్ చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తుండటంతో ఇంజన్ హీటెక్కి ఉండవచ్చని, అందుకే డ్రైవర్ పక్కకు నిలుపుకున్నాడని ఆటో ఢికొట్టడంతో వేడికి మంటలు అంటుకొని లారీ క్యాబిన్ తగులబడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

మంటల్లో సజీవ దహనమైన డ్రైవర్