Home Entertainment యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

యాంకర్ గా బుల్లితెరపై దశాబ్ద కాలంగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్న ప్రదీప్ మాచిరాజు మొత్తానికి వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడబికి సిద్ధమయ్యాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ 29కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బజ్ అయితే బాగానే ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ యాంకర్ ఎంతవరకు వసూళ్లను అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

Actor Satyadev Shocking Comments On Anchor Pradeep Movie

ప్రదీప్ కు యూత్ లో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాని టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన వారు అంతగా సక్సెస్ అవ్వలేదని పాత రికార్డులు చెబుతున్నాయి. కానీ ప్రదీప్ మాత్రం సినిమా కంటెంట్ పై గట్టి నమ్మకంతో ఉన్నాడు. పైగా సినిమా సాంగ్ ఏ రేంజ్ లో క్రేజ్ అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రదీప్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.8కోట్లు. సినిమాను తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే ప్రదీప్ మొదటి సినిమా కాబట్టి ఈ మార్కెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 4.4కోట్లు. పాటలాగానే సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావాలి. మరి ప్రదీప్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

Related Posts

జనసేనను కలిపేసుకుంటున్న టీడీపీ: లబోదిబోమంటున్న జనసైనికులు

2019లో అనుసరించిన వ్యూహాన్నే మునిసిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది. అధికార పార్టీని ఎదుర్కోవాల్సింది పోయి, జనసేన పార్టీ మీద తన ప్రతాపం చూపిస్తోంది టీడీపీ. 2019 ఎన్నికల సమయంలో 'జనసేన...

ఓటీటీ బూతుకి కళ్లెం వేయడం సాధ్యమేనా.?

  'ఓవర్ ది టాప్' - ఓటీటీ అనగానే బూతు కంటెంట్.. అనే అభిప్రాయం బలపడిపోయింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో పెద్ద సినిమాలు కూడా ఓటీటీపై విడుదలయ్యాయి. అయితే, ఓటీటీ ముసుగులో కొందరు అసభ్యకరమైన...

ఉప్పెన సినిమా చూస్తూ కంటతడి పెట్టుకున్న బన్నీ!

టాలీవుడ్ లో ఇటీవలే విడుదలై విజయాన్నందుకున్న చిత్రం ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటించిన ఉప్పెన చిత్రానికి విమర్శకుల నుంచి కూడా మంచి...

Latest News