కే.రాఘవేంద్రరావు నిర్మాణంలో ‘‘సర్కారు నౌకరి’’ ప్రారంభం

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాతగా ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై గంగనమోని శేఖర్ దర్శకత్వంలో ‘‘సర్కారు నౌకరి’’. అనే నూతన చలనచిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నూతన నటి భావనా వళపండల్ హీరోయిన్ గా ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమవుతున్నారు. జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్చాన్ చేయగా,మ్యాంగో మీడియా అధినేత,గాయని సునీత భర్త రామ్ వీరపనేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. అనంతరం హీరోహీరోయిన్లపై తీసిన తొలిషాట్ కు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా గాయని సునీత కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్,తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి,త్రినాథ్ నటీనటులు.

టెక్నీషియన్స్:
మ్యూజిక్ : శాండిల్య
ఆర్ట్ డైరెక్టర్ : రవి,
కో డైరెక్టర్ : రమేష్ నాయుడు దళే
కాస్ట్యూమ్ డిజైనర్ : రితీషా రెడ్డి
పీ.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ డిజైనర్: బాబు దుండ్రపెల్లి
నిర్మాణం : ఆర్.కె టెలీషో ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫీ,రచన,దర్శకత్వం : గంగనమోని శేఖర్,