యాంకర్ ప్రదీప్ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

actor satyadev shocking comments on anchor pradeep movie

యాంకర్ గా బుల్లితెరపై దశాబ్ద కాలంగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్న ప్రదీప్ మాచిరాజు మొత్తానికి వెండితెరపై కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వడబికి సిద్ధమయ్యాడు. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? ఈ 29కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బజ్ అయితే బాగానే ఉంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ యాంకర్ ఎంతవరకు వసూళ్లను అందుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ప్రదీప్ కు యూత్ లో అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాని టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన వారు అంతగా సక్సెస్ అవ్వలేదని పాత రికార్డులు చెబుతున్నాయి. కానీ ప్రదీప్ మాత్రం సినిమా కంటెంట్ పై గట్టి నమ్మకంతో ఉన్నాడు. పైగా సినిమా సాంగ్ ఏ రేంజ్ లో క్రేజ్ అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రదీప్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4.8కోట్లు. సినిమాను తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. అయితే ప్రదీప్ మొదటి సినిమా కాబట్టి ఈ మార్కెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 4.4కోట్లు. పాటలాగానే సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావాలి. మరి ప్రదీప్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి.