డివై చౌదరి ‘లవ్ యూ రామ్’ నుంచి పాట విడుదల

క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ వీడియోతో పాటు ఉండాలని ఉందీ నీతో’ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ తు మేరా’ పాటని విడుదల చేశారు. కె వేద ఈ పాటని బుట్యీఫుల్ మెలోడీగా కంపోజ్ చేయగా.. లిప్సిక మరింత అందంగా అలపించారు. సరస్వతి కార్తీక అందించన సాహిత్యం హీరోయిన్స్ మనసులోని ఫీలింగ్స్ ని లవ్లీగా ప్రజంట్ చేసింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది.

సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు, శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాశారు. సాయి సంతోష్ కెమరామెన్ గా, ఎస్.బి ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు

తారాగణం: రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మల్లిక్, మీర్, కె దశరధ్, డివై చౌదరి, ప్రభావతి వర్మ, శాంతి దేవగుడి తదితరులు

సాంకేతిక విభాగం
దర్శకత్వం: డివై చౌదరి
నిర్మాతలు: కె దశరధ్, డివై చౌదరి
సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వరరావు
బ్యానర్లు: మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిల్మ్స్
కథ: కె దశరధ్
డీవోపీ: సాయి సంతోష్
సంగీతం: కె వేద
ఎడిటింగ్: ఎస్.బి ఉద్ధవ్
స్క్రీన్ ప్లే: కిషోర్ గోపు, శివ మొక్క
డైలాగ్స్: ప్రవీణ్ వర్మ
ఆర్ట్: గురు మురళీకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్

Tu Mera Lyrical Song | Love You Ram | Rohit Behal, Aparna Janardanan| Lipsika | K Vedaa |DY Chowdary