ఆ పార్టీ తరపున వైఎస్ వివేకా కూతురు పోటీ.. జగన్ కు మరో షాక్ తప్పదా?

YSRCP

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఊహించని స్థాయిలో మద్దతు ఉంది. తెలంగాణ కూడా వైసీపీ ఉంటే ఆ పార్టీ కచ్చితంగా అక్కడ కూడా కొంతమేర ప్రభావం చూపి ఉండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రజల హృదయాలను గెలుచుకుంటున్న వైఎస్ జగన్ సొంత కుటుంబ సభ్యుల హృదయాలను మాత్రం గెలుచుకోలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్ వివేకా కూతురు సునీత టీడీపీ తరపున 2024 ఎన్నికల్లో పోటీ చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. వివేకా హత్య కేసు వెనుక వైసీపీ ప్రముఖులు ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో సునీత ఈ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. వైసీపీ సర్కార్ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పొలిటికల్ గా వైసీపీకి సపోర్ట్ చేయకుండా ఉండటం ద్వారా అనుకున్నది సాధించాలని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుండటంతో సునీత ఈ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ కు పోటీగా వైఎస్ సునీతను దింపాలని టీడీపీ ఆలోచిస్తోందని సమాచారం. ఈ ప్రచారంపై సునీత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

చంద్రబాబు, సునీత కొన్నిరోజుల క్రితం కలిశారని చంద్రబాబు ప్రతిపాదన విషయంలో సునీత సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. త్వరలో సునీత టీడీపీ తరపున పోటీ చేయనున్నట్టు అధికారక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. సునీత ఈ విధంగా చేస్తే మాత్రం సీఎం జగన్ ఫీలయ్యే ఛాన్స్ అయితే ఉంది.