పహ్లాజ్  నిహలానీ సినిమాకు 20 కట్లు

అప్పుడేమో ఆయన చేసింది రైట్ . ఇప్పుడేమో వారు చేసింది  తప్పు .. ఈ మాటలు అంటున్నది ఎవరో తెలుసా పహ్లాజ్ నిహలానీ . ఒకప్పటి కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్ తాజాగా ఆయన రూపొందించిన “రంగీలా రాజా ” సినిమాను సెన్సార్ చేయడానికి పంపించాడు . సెన్సార్ వారు చూసి ఈ సినిమాకు ఏకంగా 20 కట్లు పెట్టారు . ఈ మాట  విన్న పహ్లాజ్ మండిపోయాడు .

“నా సినిమా లో ఏమి వల్గర్  ఉందొ చెప్పాలని సభ్యులతో వాదనకు దిగాడు . తాముచెప్పిన కట్స్  ఇచ్చి తీర  వలసిందేనని , సబ్జెక్టు ను బట్టే కట్లు  ఇచ్చామని వారు తెలిపారు . చాలా  కాలం తరువాత గోవిందా ఈ సినిమాలో నటిస్తున్నాడు . అయితే పహ్లాజ్  చెప్పకపోయినా గోవిందా ఇద్దరి పాత్రలను తెర మీద చూపించ బోతున్నాడట . ఒకటి విజయ మాల్యా , మరోటి బాబా రాందేవ్ . బహుశ  ఇందుకోసమే సెన్సార్ వారు 20 కట్లు  ఇచ్చారేమో .

పహ్లాజ్  ఒకప్పుడు సెన్సార్ బోర్డు చైర్మన్ గా వున్నప్పుడు ఎవరి మాట వినేవాడు కాదు , చాలా దురుసుగా వ్యవహరించేవాడు . అందరు ఆయన వ్యవహార శైలి పై ఫిర్యాదు చేశారు . అందుకే ఆయనను బోర్డు నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించింది . మరి పహ్లాజ్ 20 కట్లు ఒప్పుకుంటాడా ? లేదా న్యాయం చెయ్యాలంటూ కోర్ట్ కెడతాడా ?