మరో హిస్టారికల్ బయోపిక్ లో కాంట్రవర్సీ క్వీన్

బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అనే కాకుండా కాంట్రవర్సీ క్వీన్ అని తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ కంగనా రనౌత్. ఈ సీనియర్ హీరోయిన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బ్యాక్ గ్రౌండ్ లో ఎదో ఒక వివాదం క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇక ఆమె ఎంచుకునే కథలు కూడా కాంట్రవర్సీకి దగ్గరగానే ఉంటాయి.

Sri Reddy fires On Bollywood actress Kangana Ranaut అసలు మ్యాటర్ లోకి వస్తే మనికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కంగనా రనౌత్ ఆ సినిమాను క్రిష్ తో పాటు ఆమె కూడా కొంత డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో మరో బయోపిక్ ను తెరపైకి తేవడానికి సిద్ధమైంది. అయితే ఈ సారి కంగనా తన సొంత డైరెక్షన్ లోనే సినిమాను తెరకెక్కించబోతోంది.

కాశ్మీర్ మహారాణి దిడ్డా జీవిత ఆధారంగా తెరకెక్కించబోతున్న ఆ సినిమాకు ‘మణికర్ణిక రిటర్న్స్: ద లెజెండ్ ఆఫ్ దిబ్బ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాను మణికర్ణిక నిర్మాత కమల్ జైన్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి మణికర్ణిక డీసెంట్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ ఈ హిస్టారికల్ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.