బెజవాడ పోెలీసులపై పొలిటిషియన్ గూండాగిరి (వీడియో)

ఆయనో రాజకీయ నాయకుడు. స్థానికంగా కొద్దో గొప్పా పేరుంది. ఆయన విజయవాడలోని బందరు రోడ్డులో నిబంధనలకు విరుద్దంగా రోడ్డు పై కారు పార్కింగ్ చేశాడు. ట్రాఫిక్ కు అంతరాయం అవుతుంది కారును పక్కకు తీయాలని పోలీసులు కోరారు. అంతే ఆయన పోలీసులపై గుర్రుమన్నాడు. నా కారే తీయమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ నాయకుడు ఎవరంటే…

ఆయనే చోటా నాయకునిగా పేరొందిన వెంగళరావు యాదవ్. బందరు రోడ్డులో తనకు చెందిన bz 6499 నంబర్ గల కారును నిలిపి పక్కకు వెళ్లాడు. రోడ్డుపై కారు నిలపడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును పక్కకు తీయాలని కోరగా అతనిని లెక్క చేయకుండా దురుసు ప్రవర్తనతో కారును దౌర్జన్యంగా నడుపుతూ ట్రాఫిక్ వాహనానికి చెందిన బారికేడుపై నుంచి తీసుకుంటూ వెళ్లిపోయాడు. 2009లో వెంగళరావు బిజెపి నుంచి బెజవాడ ఎంపీగా పోటీ చేశారు. అతను గెలుస్తాడో లేదో కానీ ఈ సారీ కూడా బిజెపి నుంచి ఎంపీగా పోటి చేసే అవకాశం ఉందట. వెంగళరావు చేసిన హడావుడి చూసిన ప్రజలు ఈయన బడా నాయకుడు అవుతాడేమోనని అనుకున్నారట. ట్రాఫిక్ సీఐ ఫిర్యాదు మేరకు వెంగళరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చూశారుగా అందరికి ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో. వెంగళరావు పోలీసులతో ప్రవర్తించిన వీడియో కింద ఉంది మీరూ చూడండి.