వంగవీటి రాధా కోసం జనసేన స్కెచ్: జగన్ ఏం చేశారంటే?

విజయవాడ సెంట్రల్ టికెట్ పై నెలకొన్న రగడ తీవ్ర దుమారం రేపింది. రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంకా ఈ విషయంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధాను కాదని మల్లాది విష్ణుకి కేటాయించడంతో అధిష్టానంపై అసంతృప్తికి లోనయ్యాడు రాధా. కొద్ది రోజుల కిందట ఆ సీటు మల్లాది విష్ణుకి కేటాయిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాధా ఇంటి వద్దకు చేరుకొని వైసిపికి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేసారు. ఆయన సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ పార్టీకి రాజీనామా కూడా చేశారు.

అయితే రాధా తన అనుచరులతో సంయమనం పాటించమని, కొద్ది రోజులు నేతలతో చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. అయితే సెంట్రల్ సీటు విషయంలో అధిష్టానం వెనక్కి తగ్గకపోవడంతో ఆయన పార్టీ మారుతారని ప్రచారం సాగింది. అదే తరుణంలో జనసేన నేతలు రాధతో టచ్ లోకి వచ్చారు. ఈ విషయం వైసిపి పార్టీ పెద్దలకు తెలియడంతో అలెర్ట్ అయింది అధిష్టానం. రాధాను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. జగన్ కూడా రాధాతో దాదాపు గంటపైనే ఫోన్ లో సంభాషించినట్టు సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు మచిలీపట్టణం ఎంపీ సీటుకు పోటీ చేసేందుకు రాధాను ఒప్పించడంలో అధిష్టానం సక్సెస్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాధా రెండు రోజులుగా సన్నిహితులు, పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి రాధకు ఘానా స్వాగతం తెలిపారు. దీంతో ఎప్పటి నుండో సస్పెన్స్ లో ఉన్న రాధా వివాదం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రాధా కూడా పార్టీ మారితే ప్రయోజనం ఉండదనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. మచిలీపట్టణం నుండి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సెంట్రల్ సీటు విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడినట్టే కనిపిస్తోంది.

 

ఇది కూడా చదవండి

హైదరాబాద్ లో బంగారం ధరలు

 

ఇది కూడా చదవండి

‘‘ తెలంగాణ వాదులను తరిమికొట్టిన మైనంపల్లి , దానం నాగేంద‌ర్‌, తీగల కృష్ణారెడ్డిలను పార్టీలో చేర్చుకొని పెద్ద పీట వేసినప్పడు మీకు సిగ్గు అనిపించలేదా? ’’

కెసియార్ కు ఉత్తమ్ బహిరంగ లేఖ