‘రామాయణం’పై నెటిజన్ల అత్యుత్సాహం!

ఆలూలేదు..చూలూ లేదన్న సామెత లాగా ఇప్పుడు రామాయణం సినిమా కథ నడిపించేస్తున్నారు. రణబీర్‌కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణ’ సినిమా షూటింగ్‌ ఇటీవలే ముంబయిలో మొదలైందన్న విషయం నిర్మాతలకే తెలియదు.

కానీ షూటింగ్‌ ప్రారంభం అయినట్లు సోషల్‌ విూడియాలో షేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీతారాముల పాత్రల్లో సాయిపల్లవి, రణబీర్‌కపూర్‌ నటిస్తుండగా, రావణాసురుడి పాత్రను కన్నడ అగ్ర హీరో యష్‌ పోషిస్తున్నారు. నితీష్‌ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి.

ఇదిలావుండగా రావణుడి పాత్ర కోసం యష్‌ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. కాస్త భారీకాయంతో కనిపించేందుకు ఆయన 20 కిలోల బరువు పెరగాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఈ దిశగా ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం యష్‌ ‘టాక్సిక్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాతే ఆయన ’రామాయణ’ సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ముంబయిలో వేసిన అయోధ్య సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. సాయిపల్లవి జూన్‌లో షూటింగ్‌లో జాయిన్‌ కానుంది.