యాక్షన్ షురూ చేసిన సీఎం జగన్ ! త్వరలో ‘RRR’పై వేటు ఖాయం !

The Jagan government is taking action against Raghuram Krishnaraju

గత కొంతకాలం నుండి వైసీపీ పార్టీ, సీఎం జగన్ మీద సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఎదురుదాడి చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు మిన్నకుండి పోవటంతో నాయకుల, కార్యకర్తలది ఏం జరుగుతుందో అర్ధం కానీ పరిస్థితి. రఘురామ మీద యాక్షన్ తీసుకుని ఆయన నోరు మూయించాలని పార్టీ వర్గాలన్నీ ఏకమై కార్యాచరణని సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ఇటీవలనే రాజద్రోహం కింద రఘురాము అరెస్ట్ కావటం, కొన్ని రోజులకి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత… ఆయన ఢిల్లీలోనే ఉంటూ అన్ని పార్టీల ఎంపీలకు తనకు జరిగిన అన్యాయం పై లేఖలు రాయటంతో ఆయనకు అన్ని పార్టీల నుంచి మద్దతు పెరిగింది. మరోవైపు అన్ని రాష్ట్రాల సీఎంలకు సైతం ఆయన లేఖలు రాశారు. దీంతో జాతీయ స్తాయిలో సీఎం జగన్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యిందన్నది వాస్తవం. ఇక చూస్తూ ఊరుకుంటే రఘురామ చేసే నష్టం భారీగా ఉంటుందని గ్రహించి వెంటనే వైసీపీ నాయకత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది.

ఇందులో భాగంగానే ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ విషయం మీద శనివారం ర‌ఘురామ మీడియాతో మాట్లాడుతూ… తనపై వైసీపీ ప్రభుత్వం అన‌ర్హత వేటు వేయ‌డం కుదరదని ఎందుకంటే తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్టలేదని అన్నారు.
తాను పార్టీ కార్యక‌లాపాల‌కు విరుద్ధంగా వ్యవ‌హ‌రించ‌లేదని, ప్రభుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌ల్లో లోపాల‌ను మాత్రమే ప్రస్తావించటం జరిగిందన్నారు.

తాజాగా వైసీపీ అధికార వెబ్ సైట్ లో ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు పేరుని పార్టీ ఎంపీల జాబితా నుంచి తొలిగించటం హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో గెలిచిన 22 ఎంపీ, రాజ్యసభ సభ్యులను కలుపుకుని వైసీపీ పార్టీ నుండి మొత్తం 28 పార్లమెంట్ సభ్యుల పేర్లను గతంలో నమోదు చేశారు. ఈ రోజు ర‌ఘురామ కృష్ణంరాజు పేరుని తొలగించి ఇటీవల తిరుపతి ఉపఎన్నికలో విజయం సాధించిన గురుమూర్తి పేరుని ఎంపీల జాబితాలో నమోదు చేయటం జరిగింది. దీంతో త్వరలో రఘురామ మీద భారీ వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తుంది.