ఏపీలో రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు అదిరిపోయే తీపికబురు.. ఆ నెల నుంచి అవి కూడా ఇస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులను కలిగి ఉన్నవాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే ఏపీలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా బియ్యంతో పాటు ఇతర సరుకులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో రేషన్ కార్డ్ కలిగిన వాళ్లకు కొన్ని ప్రాంతాలలో జొన్నలు, రాగులను పంపిణీ చేస్తున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం రాగులకు బదులుగా రాగి పిండి పంపిణీ చేయనుందని తెలుస్తోంది. కేవలం 11 రూపాయలకే కేజీ రాగిపిండిని పొందవచ్చు. రాగిపిండితో చేసిన వంటకాలను తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాలలో మొదట రాగిపిండిని పంపిణీ చేయనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.

రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో సైతం రాగి పిండి పంపిణీ జరగనుందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ప్రజలకు బెనిఫిట్ కలిగేలా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని సరుకులను ప్రజలకు పంపిణీ చేసేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు తక్కువ ధరకే సరుకులు లభించడం వల్ల ఖర్చులు తగ్గుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం అందించే సరుకులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మాత్రం రేషన్ డీలర్లను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పేద, మధ్యతరగతి ప్రజలకు పోషకాలతో కూడిన ఆహారం అందేలా చేయాలని ఇచ్చే సరుకుల విషయంలో ఏపీ సర్కార్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. తక్కువ ధరలకే ఏపీ ప్రభుత్వం నాణ్యమైన సరుకులను పంపిణీ చేస్తోంది.