విద్యుత్ సౌధ వద్ద టెన్షన్ టెన్షన్.. (వీడియో)

తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పోరుబాట పట్టారు. వారి ఆందోళన ఉధృతంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18వేల మందిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే టిఆర్ఎస్ సర్కారు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే తమను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా విద్యుత్ సౌధ వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారందరినీ బలవంతంగా అరెస్టు చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే విద్యుత్ సౌధ వద్ద ఉన్న బస్టాండ్ లో నిలబడి ఉన్న ప్రయాణీకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. కింద వీడియో ఉంది చూడండి.