తమ వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలో గ్రామపంచాయతీ మహిళా సిబ్బంది అయిన ఓ అవ్వ సీఎం కేసీఆర్ ను నిలదీశారు. తమ సమస్యలు కేసీఆర్ ఎందుకు పరిష్కరించరని ఆమె ప్రశ్నించింది. ఉన్నవాళ్లకే ప్రభుత్వం ఊడిగం చేస్తుందని లేని వాళ్లకు సర్కార్ ఏం చేస్తుందన్నారు. మూడెకరాల జాగేమాయే, ఇండ్లేమాయే… ఒక్క వెయ్యి రూపాయల మాకిచ్చేది… అవి కూడా మాకేమొద్దు కేసీఆర్ నే తీసుకోమనండి అంటూ ఆమె కేసీఆర్ ను విమర్శించింది. వికలాంగుల పింఛన్ తీసేస్తురు.. మంచిగున్నోనికి వస్తయి.. అసలోనికి పింఛన్ రాదా అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కేసీఆర్ మా ఊరికి రావాలే.. మా బాధలు తీర్చాలే… రమ్మనండి కేసీఆర్ ను నేనే అడుగుతా ఏం భయపడను అంటూ ఆ మహిళ మాట్లాడింది. ఆ అవ్వ ఇంక ఏమి మాట్లాడిందో ఆమె మాటల్లోనే కింద ఉన్న ఈ వీడియోలో చూడండి.
[videopress HrY5iUU7]