టీడీపీ నేతలు నిద్రలేవాల్సిన సమయం ఆసన్నమైందా.. మారాలంటూ?

ఈ మధ్య కాలంలో ఎన్నికలకు సంబంధించి ఏ సర్వే ఫలితాలు వెలువడినా ఆ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధించడం ఖాయమని సర్వేల ఫలితాలతో స్పష్టమవుతోంది. అదే సమయంలో టీడీపీ నేతలు నిద్రలేవాల్సిన సమయం కూడా ఆసన్నమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీపై గత కొన్నేళ్లలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనేది వాస్తవమేననే సంగతి తెలిసిందే.

జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రజలకు కోపం తెప్పించే విధంగా ఉన్నాయి. అయితే టీడీపీతో పోల్చి చూస్తే వైసీపీనే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సర్కార్ కనీసం సంక్షేమ పథకాలను కరెక్ట్ గా అమలు చేస్తోందని టీడీపీ ఆ విషయంలో కూడా విఫలమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ వైసీపీపై విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను టీడీపీ నేతలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు.

గోరంట్ల మాధవ్ వివాదం విషయంలో వైసీపీని ఎవరూ తప్పుబట్టడం లేదు. గోరంట్ల మాధవ్ తప్పు చేశారని 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ పదవికి వైసీపీ తరపున పోటీ చేసే ఛాన్స్ ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు పార్టీ బలపడే దిశగా అడుగులు వేయని పక్షంలో ఏ మాత్రం లాభం లేదు. టీడీపీ నేతలు ప్రజల మధ్య తిరగడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు.

2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే నమ్మడం లేదు. మరోవైపు రాష్ట్రంలో జనసేన పార్టీ కూడా పుంజుకునే పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఎన్నికల ఫలితాలు మారే ఛాన్స్ అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ తమ పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేయడానికి అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది.