చంద్రబాబుపై రోజా మళ్లీ నిప్పులు…

చంద్రబాబు తన పబ్లిసిటి కోసం అమాయక ప్రజల  ప్రాణాలు తీసుకున్నారని వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజా విమర్శించారు. నాలుగేళ్ల క్రితం గోదావరి పుష్కరాల సమయాన రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది అమాయకులు బలయ్యారని, ఈ మహానుభావుని రాకకై చేసిన హడావుడి ఫలితంగానే 30 మంది అమాయకులు బలయ్యారని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. వనం-మనం కార్యక్రమం కోసం అమాయక విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారని ఈ పాపాత్ముడు చంద్రబాబు వల్లే ఈ ఘటన జరిగిందని ఆమె విమర్శించారు. జగన్ బిజెపితో కలుస్తున్నారని తప్పుడు వార్తలు వస్తే  నిప్పు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతారని, పప్పు ఏమో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారన్నారు. లోకేష కు దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు.

చంద్రబాబు నాయుడుకు టిడిపి మేనిఫెస్టో వెబ్ సైట్ లో పెట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.  ఈ నాలుగేళ్లలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను దోచుకున్నారే తప్ప ఆయన  చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా కరువు వస్తుందని ఆయన కాలు అటువంటిది అన్నారు. చంద్రబాబు రైతులకు చేసిందేమి లేదని రుణమాఫీ ఎక్కడ చేశారో చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటనతో చంద్రబాబు బండారం బయటపడిందన్నారు.  నీటి నిల్వ లేకుండా ముంపు ప్రాంతం ఎలా పెరిగిందన్న గడ్కరీ ప్రశ్నకు చంద్రబాబు నీళ్లు నమిలారని దీంతో ఆయన బండారం ఏంటో ప్రజలందరికి తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో పాఠశాలలు మూతపడ్డాయని, విద్యార్థులను చదువుకు దూరం చేసిన పాపం బాబుకు తగులుతుందన్నారు. వీరి హయాంలో 54 ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు మూత పడ్డాయని అనేక మంది నిరుద్యోగులుగా తయారు చేసిన పాపాత్ముడు చంద్రబాబని రోజా దుయ్యబట్టింది.

చంద్రబాబు నాయుడు 1500 రోజుల పరిపాలనలో రాష్ట్రాన్ని నంబర్ వన్  గా చేశామని గొప్పలు చెబుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని అవినీతిలో, మహిళలపై దాడుల్లో, రాష్ట్ర ప్రగతిని తుంగలో తొక్కడంలో నంబర్ వన్ చేశారని విమర్శించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆయన ఎప్పుడూ కూడా ఎన్నికలకు ఒంటరిగా వెళ్లలేదన్నారు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే సీఎంగా చంద్రబాబు చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు.