తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలకు మంత్రి కేటిఆర్ శుభవార్త చెప్పారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు మంచి స్పందన వస్తుండటంతో రాష్ట్రమంతా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు.
బస్తీ దవాఖానాల విస్తరణ మీద మంత్రులు కెటి రామారావు, లక్ష్మారెడ్డిలు ఉన్నతస్ధాయి సమీక్షా నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైద్య అరోగ్య శాఖా, పురపాలక శాఖాధికారులు పాల్గోన్నారు. హైదరాబాద్లో జియచ్ యంసి పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన బస్తీ దవాఖానాలకు ప్రజలనుంచి వస్తున్న మంచి స్పందన నేపథ్యంలో వీటిని రాష్ర్ర్టంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ముందుగా రాష్ర్టంలోని అన్ని కార్పోరేషన్లతోపాటు పాత జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖానాలు ప్రారంభించాలని మంత్రులు అదికారులకు అదేశాలు జారీ చేశారు. మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే నిజామాబాద్ లో 5, కరీంనగర్ పట్టణంలో 5, వరంగల్ పట్టణంలో 12 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రులకు అధికారులు తెలియజేశారు. అందరికీ అందుబాటులో అరోగ్యం అనే స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ వైద్య అరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నదని మంత్రులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయడం, కొత్త వాటిన ఏర్పాటు చేయడంతోపాటు పట్టణాల్లో బస్తీ దవాఖాన వంటి వినూత్నమైన ఏర్పాట్లతో ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రి కెటియార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత నెలలో స్వయంగా బేగంపేటలోని బస్తీ దవాఖానను అకస్మిక తనీఖీ చేసిన సందర్బంగా అక్కడి సేవలు ఉపయోగించకునేందుకు వచ్చిన ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, ముఖ్యంగా ప్రాథమిక వైద్య అవసరాలకోసం ఇంతకు ముందుకు ప్రయివేటు క్లినక్కుల్లో డబ్బులు ఖర్చు చేసేదని, ఇప్పుడు తమకు ఆ పరిస్ధితి తప్పిందని సంతోషం వ్యక్తం చేశారన్నారు. ప్రజల నుంచి మరిన్ని బస్తీ దవాఖానాలకు డిమాండ్ ఉన్నదని, ఈ నేపథ్యంలో వాటి విస్తరణకు ఈ సంయుక్త సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి కెటి రామారావు తెలిపారు.
దీంతోపాటు ముఖ్యమంత్రి అదేశాల మేరకు వచ్చే వేసవి నాటికి హైదరాబాద్ నగరంలో 500 బస్తీ దవాఖానాలు ప్రారంభించేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలన్నారు. ఈ డిసెంబర్ మాసాంతానికి సూమారు 175 బస్తీదవాఖానాలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న నగర జనాభా వైద్య అవసరాలను అందుకునేలా, ముఖ్యం పేదల సంఖ్య అధికంగా ఈ ఉండే ప్రాంతాల్లో ఇవి ఉండేలా చూడాలన్నారు. ఈ బస్తీ దవాఖానాలన్నింటినీ అన్ లైన్లో మ్యాపింగ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఈ మేరకు అవసరం అయితే ఐటి శాఖ సహాకారం తీసుకోవాలన్నారు. ఈ 500 బస్తీ దవాఖానాలకు అవసరం అయిన భవనాల గుర్తించాలని, ఒకవేల భవనాలు అందుబాటులో లేకుంటే నూతనంగా నిర్మించేందుకు చర్యలు ప్రారంభించాలని పురపాలక శాఖాధికారులకు మంత్రి కెటియార్ ఈ సందర్భంగా అదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రారంభానికి సిద్దం చేస్తున్న మరో 28 బస్తీ దవాఖానాలను సెప్టెంబర్ మొదటి వారంలో ఒకేరోజు ప్రారంభించాలని అధికారులను మంత్రులు అదేశించారు.
బస్తీ దవాఖానాలతోపాటు తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను సైతం మంత్రులు సమీక్షించారు. ఇప్పటికే ఈ సెంటర్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదన వైద్య అరోగ్య శాఖాధికారులు మంత్రులకు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఈ సెంటర్ల ఏర్పాటు లక్ష్యంతో వైద్య అరోగ్య శాఖ ప్రణాళికలు తయారు చేస్తున్నదని అధికారులు తెలిపారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్ సేవలను మరింతా ప్రజల్లోకీ తీసుకువెళ్లేందుకు ప్రభుత్వాసుపత్రులు, పిహెచ్ సి సెంటర్ల వద్ద సమాచారం అందుబాటులో ఉంచాలని మంత్రులు అదికారులకు సూచించారు.
ఈ సమావేశంలో పురపాల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, వైద్య అరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతకూమారి, కమీషనర్ వాకాటి కరుణ, జియచ్ యంసి మేయర్ బొంతు రామ్మోహాన్, కమీషనర్ జనార్ధన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.