సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం

తెలంగాణ సీఎం కేసీఆర్ సోదరి లీలమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లీలమ్మ సోమవారం ఉదయం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  సోదరి లీలమ్మ కన్నుమూతతో సీఎం కేసీఆర్ తన ఢిల్లి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ ఢిల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ రానున్నారు.

లీలమ్మ భర్త శంకర్ రావు వీరి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం పదిర గ్రామం. వీరికి ఇద్దరు కుమారులు కాంతారావు, మధుసూదన్ రావులు ఉన్నారు. లీలమ్మ మృతితో సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.