బాబు మోహన్‌కు కేసీఆర్ షాక్

 

రాష్ట్ర శాసనసభను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న  అపద్దర్మ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దైన రోజే 105 మంది ఎమ్మెల్యే  అభ్యర్దులను ప్రకటించారు. ఆంధోల్ ఎమ్మెల్యే బాబు మోహన్ కు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. బాబు మోహన్ కు టిక్కెట్ నిరాకరించారు. ఆందోల్ లో జర్నలిస్టు నేత క్రాంతికి టిక్కెట్ ఇచ్చారు. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కూడా టికెట్ నిరాకరించి  ఆ  స్థానంలో బాల్క సుమన్ కు టిక్కెట్ ఇచ్చారు. మిగిలిన స్థానాలన్ని సిట్టింగ్ లకే కేటాయించారు. టిక్కెట్ నిరాకరిచింన నేతలతో మాట్లాడానని పార్టీ వారికి సముచిత స్థానాన్ని ఇస్తుందని కేసీఆర్ తెలిపారు. గజ్వేల్ నుంచే కేసీఆర్ మళ్లీ పోటి చేయనున్నారు.