తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 1827 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్థిక శాఖ నుంచి తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదలయ్యాయి. టీచింగ్ ఆస్పత్రులలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 26 మెడికల్ కాలేజీల ఏర్పాటు జరగగా మరో 8 కాలేజీల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ కాలేజీల ద్వారా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించనున్నారు. మెడికల్ కాలేజీలకు సిబ్బంది కొరత రాకుండా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తుండటం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వం 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ దిశగా కూడా అడుగులు వేస్తోంది. మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే అలోచనతో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు జరగనుందని సమాచారం అందుతోంది. స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభించనుంది.
సీఎం కేసీఆర్ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేయడం నిరుద్యోగులకు కూడా సంతోషాన్ని కలిగించింది. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగేలా మరిన్ని జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయేమో చూడాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య తగ్గుతోంది.