బాబు చేసిన తప్పు జగన్ తో చేయిద్దామనుకున్న జనసేన!

ఏపీలో మూడు రాజధానులు – ఒక రాజధాని (అమరావతి) గురించి గత కొంత కాలంగా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ & కో లు అమరావతి మాత్రమే రాజధాని అని చెబుతుంటే…”అమరావతి కూడా” రాజధానే అని వైకాపా చెబుతుంది. ఈ పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా సైలంటు గా ఉన్న ఈ వ్యవహారం కాస్త బుగ్గన రాజేంద్రనాథ్ రేపిన అలజడితో మళ్లీ వేడెక్కింది!

అవును… బెంగళూరు వెళ్ళిన బుగ్గన, మూడు రాజధానుల అంశంపై స్పందించిన అంశాలు ఏపీలో రాజకీయ రచ్చకు దారితీసాయి. మూడు రాజధానులూ లేవూ ఏమీ లేవు.. విశాఖ మాత్రమే ఏపీకి ఏకైక రాజధాని అని అర్ధం వచ్చేలా బుగ్గన చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపాయి. అయితే అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ మంత్రి అంబటి రాంబాబులు కాస్త సవరణలు చేసే ప్రయత్నం చేసినా.. ఈ లోపు లేగిన దుమారం పాకుతూనే ఉంది. ఈ క్రమంలో మైకందుకున్నారు జనసేన నేత నాదేండ్ల మనోహర్.

2019 ఎన్నికల సమయంలో రాష్ట్రం సంగతి పక్కన పెట్టిన బాబు.. పూర్తి నమ్మకం రాజధాని అమరావతిపై పెట్టుకుని రంగంలోకి దిగారు. ఫలితం అందరూ చూసిందే! ఇదే విధంగా… రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ కూడా చేయాలని సూచిస్తున్నారు నాందెండ్ల! అవును… విశాఖే రాజధాని అని అజెండా సెట్ చేసుకుని ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు!

అయితే… దీనికి ఇప్పటికే వైకాపా నుంచి సమాధానం వచ్చేసింది. తమ ఎన్నికల అజెండాలో “మూడు రాజధానులు కూడా” ఒక అంశమని.. వికేంద్రీకరణ తమ అజెండా అని తేల్చి చెప్పేశారు వైకాపా నేతలు! దీంతో బాబు చేసిన తప్పును జగన్ తో చేయిద్దామని ప్లాన్ చేసిన జనసేన ప్లాన్ ని ఆదిలోనే తుంచేశారు వైకాపా నేతలు!

ఏది ఏమైనా… 2019లో బాబు చేసిన తప్పుని 2024లో జగన్ తో చేయిద్దామని జనసేన ప్లాన్ చేయడం మాత్రం గొప్ప విషయమే అని అంటున్నారు విశ్లేషకులు! ఏపీలో ఇంకా ఈ రాజధాని రాజకీయాలు ఎంతకాలం సాగుతాయనేది మాత్రం వేచి చూడాలి!