Perni Nani: చంద్రబాబుది ‘దిక్కుమాలిన’ సర్వే: మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

Perni Nani: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ సర్వేపై మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సమగ్ర భూ సర్వేనే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కాపీ కొడుతోందని పేర్ని నాని ఆరోపించారు. “జగన్ హయాంలో సుమారు 6,000 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయింది. అప్పుడు ఉపయోగించిన డ్రోన్ డేటా, శాటిలైట్ లింక్, ఓఆర్‌ఐ (ORI) కాపీలనే ఇప్పుడు ఈ ప్రభుత్వం వాడుకుంటోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతతో జగన్ చేపట్టిన సర్వేను చంద్రబాబు ‘దిక్కుమాలిన సర్వే’గా మార్చారు” అని విమర్శించారు.

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌పై కూడా పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు.  జగన్ హయాంలో పంపిణీ చేసిన పాస్‌బుక్‌లపై కేవలం జగన్ ఫోటో తొలగించి, రంగులు మార్చడం తప్ప కూటమి ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. “గత రెండేళ్ల పాలనలో (2024 నుంచి) రైతులకు సంబంధించి ఏ ఒక్క భూ వివాదాన్నైనా పరిష్కరించారా? ఒక్క కొత్త పాస్‌బుక్ అయినా ఇచ్చారా?” అని ఆయన నిలదీశారు.

రెవెన్యూ వ్యవస్థపై మంత్రికి కనీస అవగాహన లేదని, 1995 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రైతుల భూ సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని దుయ్యబట్టారు. తక్కెళ్లపల్లిలో ప్రారంభించిన సర్వే ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో జగన్ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పులను ఇప్పుడు తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

బాబు యూటర్న్ || Analyst Ks Prasad About Chandrababu Takes U Turn On Ys Jagan AP Land Titling Act |TR