Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ నుంచి శృతి హాసన్‌ ఫస్ట్ లుక్ రిలీజ్ – 2026 సమ్మర్ లో థియేట్రికల్ రిలీజ్

Aakasamlo Oka Tara: వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి.

తాజాగా చిత్ర బృందం ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న శృతి హాసన్, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆమె కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంది. పెదవుల పై ఉన్న సిగరెట్‌, దాని నుంచి ఎగసే పొగ ఆమె పాత్రకు రఫ్‌, గ్రిట్టీ టచ్‌ను జోడిస్తోంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుంది. ఆమె ప్రజెన్స్ పవర్ ఫుల్ గా ఉండబోతోంది.

ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఉండబోతుంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతి హాసన్

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: పవన్ సాదినేని
రచయిత: గంగరాజు గున్నం
నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా
సంగీతం: జి.వి. ప్రకాష్
సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్వేతా సాబు సిరిల్

అమరావతి  నిర్లక్ష్యం || Chalasani Srinivas EXPOSED Amaravati Scam || Chandrababu || Tdp Vs Ycp || TR