Yadhu Vamsee: ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో దర్శకుడు యదు వంశీ టాలీవుడ్ ఆడియెన్స్ మీద చెరగని ముద్ర వేశారు. కొత్త వారితో తీసిన ఆ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక యదు వంశీ తన రెండో ప్రాజెక్ట్ కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో తన రాబోయే ప్రాజెక్ట్ కోసం ఒక యువ మహిళా నటి కోసం క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి కోసం యదు వంశీ అన్వేషిస్తున్నారు. నటన, ప్రతిభ-ఆధారిత ప్రక్రియ ద్వారా తెలుగు సినిమాలోకి ప్రవేశించడానికి ఆశావహులైన నటీమణులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించడం లక్ష్యంగా యదు వంశీ ముందుకు సాగుతున్నారు.
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో 15 మంది కొత్త ఆర్టిస్టులు, టాలెంట్ ఉన్న హీరో, హీరోయిన్లు తెరపైకి వచ్చారో అందరికీ తెలిసిందే. విలేజ్, రూటెడ్ కథతో వచ్చిన యదు వంశీ ఈ చిత్రం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నారు. ఇది గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో అత్యున్నత గౌరవాలను అందుకుంది. దుబాయ్‌లోని గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA)లో అంతర్జాతీయ గుర్తింపును పొందింది. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక నామినేషన్‌ను పొందింది. రూటెడ్ కథలు చెప్పాలన్న యదు వంశీ నిబద్దతను ఈ విజయాలు దృఢంగా నిలబెట్టాయి.
ఈ కాస్టింగ్ కాల్‌తో దర్శకుడు కొత్త వారిని కనుగొనడం వైపు దృష్టి సారించారు. ఉత్సాహం, విశ్వాసం, సాంస్కృతిక మూలాల మిశ్రమాన్ని సహజంగా ప్రతిబింబించే “అచ్చమైన తెలుగు అమ్మాయి” కోసం అన్వేషణ జరుగుతోంది. గ్లామర్ కంటే వ్యక్తీకరణ సామర్థ్యం, భావోద్వేగ లోతు, తెలుగు భాషపై ఉన్న పట్టుతో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
https://x.com/i/status/2016145139404832778

మన మట్టి కథల్ని చెబుతున్నప్పుడు, ఆ భావాల్ని పండించగలిగే, చూపించగలిగే ఆర్టిస్టులు ఉండాలని యదు వంశీ భావిస్తున్నారు. అందుకే మన తెలుగు వారి కోసమే యదు వంశీ ప్రయత్నిస్తున్నారు. ఆశావహులైన అభ్యర్థులు తమ ఆడిషన్ వీడియోలను నేరుగా బృందానికి సమర్పించవచ్చు. yadhuvamseeYV2@gmail.com కు ఇమెయిల్ ద్వారా లేదా WhatsApp 8639164104 కు వీడియోలను పంపవచ్చు. ప్రస్తుతం కాస్టింగ్ కాల్ ఆన్‌లోనే ఉంది. ఇక ఎంట్రీలను ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షిస్తూనే ఉంటారు.
సృజనాత్మక దృష్టితో ఆలోచించి ఈ ప్రకటన చేసింది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. నిజాయితీగల ప్రతిభను ప్రోత్సహించడానికి, కంటెంట్-ఆధారిత తెలుగు సినిమాలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఈ ప్రకటనతో తన నిబద్ధతను చాటుకుంది. పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే కొత్త వారికి చోటు కల్పిస్తున్నందున, ఈ కాస్టింగ్ కాల్ ఒక అర్థవంతమైన అవకాశంగా నిలుస్తుంది. చాలా మంది యువ ఆశావహులకు ఇది కలల ప్రపంచమైన సినిమా ప్రయాణం వైపు మొదటి అడుగు కావచ్చు. ఓ బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన టీంతో కలిసి పని చేసే అవకాశాన్ని మిస్ కాకండి.

