CAT Movie: CAT మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు

CAT Movie: VRGR మూవీస్ బ్యానర్ పై Y. గంగాధర్ IPS సమర్పణలో, రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు G.V. నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ” CAT “…. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఇప్పుడే CAT మూవీ పోస్టర్ లాంచ్ చేసాము, దర్శకుడు కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, CAT స్టోరీ కూడా చెప్పారు. వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అందరికి పేరు తీసుకురావాలని, త్వరలొ విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి CAT చిత్ర విజయం పొందాలని బుచ్చి బాబు ఆకాంక్షించారు.

డ్రామా, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో G.V. నాయుడు , V.J. బాలు , లావణ్య , కళ్యాణి రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ :- పంకజ్ తొట్టాడ ఎడిటింగ్ :- D.వెంకటప్రభు మ్యూజిక్ :- మారుతి రాజా కథ, స్క్రీన్ ప్లే, మాటలు :- V.CH శేఖర్ ముద్దు దర్శకత్వం :- G.V. నాయుడు (గొంగటి వీరాంజనేయులు).

టీచర్ సస్పెండ్ || Khammam Government Teacher Bhukya Gowthami Issue EXPOSED By Dasari Vignan || TR