జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినా ఆ సభ ఆగదు : ఉత్తమ్ (వీడియో)

సంగారెడ్డిలో బుధవారం జరిగే మైనార్టీల సదస్సు సభ ఎట్టి పరిస్థితిలో ఆగదని పిసిసి చీఫ్ ఉత్తమ్ అన్నారు. జగ్గారెడ్డిని ఎదుర్కొనే దైర్యం లేక తప్పుడు కేసులో అరెస్టు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ చేతగాక టిఆర్ ఎస్ చేయిస్తున్న కుట్ర అన్నారు. బుధవారం జరిగే సభకు గులాం నబీ ఆజాద్ హాజరవుతారని ఆయన తెలిపారు. సభ ఏర్పాట్ల బాధ్యతలను మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి ఉత్తమ్ అప్పగించారు. ఉత్తమ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి. 

https://www.youtube.com/watch?v=WyG-5K-uuD0