మీ పిల్లల్నిచదివించే పూచీనాది, ఆ పై ఉద్యోగాలు…

వైయస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్ యువకుల మీద దృష్టి సారించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువకులు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో ఈ పార్టీ యువకులను, విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నది. గతంలో ఎపుడూ ఏ రాజకీయ పార్టీ ఇవ్వనంత ప్రాముఖ్యం వైసిపి ఈ ఎన్నికల్లో యువకులకు ద్యోగావశాలకు ఇస్తున్నది. పోలింగ్ దగ్గిర పడుతున్న సమయంలో జగన్ తన ప్రచారాన్ని యువకుల మీద కు మళ్లించారు. క్యాంపెయిన్ టార్గెట్ను యూత్ మీద కు మళ్లించారు. జగన్ యువకులకు చేసిన హామీలు:

వైసిపి అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అందుకోసం రెగ్యులర్‌గా నోటిఫికేషన్లు జారీ చేస్తాం. ఏటా జనవరి 1న వాటి క్యాలెండర్‌ రిక్రూట్ మెంట్ క్యాలెండర్ ప్రకటిస్తాం.

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ప్రత్యే చట్టం రూపొందిస్తాం. పారిశ్రామికవర్గానికి నష్టం కలగకుండా ప్రతి జిల్లా యూనిట్‌గా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేసి, యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తాం.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చదువుల్లో కూడా మార్పు చేస్తామని చెప్పారు.
కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలతో పాటు, ఆర్టీసీ నడిపై బస్సు సర్వీసుల్లోనూ. ప్రభుత్వ శాఖలు అద్దె (లీజు)కు తీసుకునే వాహనాల్లోనూ యువతకు ప్రాధాన్యం ఇస్తాం. ఆ వాహనాల కొనుగోలులో యువకులకు సబ్సిడీ కూడా ఇస్తాం.

రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాధన్‌ కమిటీ తేల్చింది. తర్వాత పదవీ విరమణలతో ఖాళీల సంఖ్య ఇప్పుడు దాదాపు 2.30 లక్షలకు చేరింది. అయినా ప్రభుత్వం మాత్రం వాటిని భర్తీ చేయడం లేదు. నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. అందుకే ‘జాబు రావాలంటే బాబు పోవాలన్నట్లుగా మారింది’

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల బాధలు చూశాను. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకున్న తల్లిదండ్రులను కూడా చూశాను. అందుకే ‘నేను ఉన్నాను’.మీ పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, సివిల్‌ సర్వీసులు ఏది చదివించినా సరే. దగ్గరుండి నేను చదివిస్తాను. మొత్తం ఫీజు ప్రభుత్వం కడుతుంది. అంతే కాకుండా వారికి హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఏటా రూ.20 వేలు ఇస్తాము.

ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి, అందులో 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం.గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, అన్ని ప్రభుత్వ పథకాల డోర్‌ డెలివరీ చేస్తాం . వలంటీర్లు వారు గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉండి పని చేస్తారు. వారికి రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాం.