వాట్సాప్ యూజర్స్ కు గుడ్ న్యూస్

వాట్సాప్… యూజర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త మార్పులు తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో డవలప్ మెంట్ చేసింది. ఇక పై ఫోన్ స్టోరేజ్ వేస్టు కాకుండా ఓ కొత్త ఫీచర్ వచ్చింది. అది ఏంటంటే…

వాట్సాప్ లో చాలా గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులలో చాలా ఇమేజేస్, వీడియోస్ వస్తుంటాయి. ఇవి ఓపెన్ చేస్తే డౌన్ లోడ్ కాగానే ఫోన్ స్టోరేజిలోకి వెళ్లిపోతాయి. ఇక పై అలా కాకుండా వాట్సాప్ గ్రూపు ఓపెన్ చేసిన తర్వాత పైన ఉన్న 3 చుక్కలను తాకి గ్రూపు ఇన్ ఫో ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్లలో MEDIA VISIBILITY   అనే ఆప్షన్ కొత్తగా చేరింది. దానిని క్లిక్ చేసి NO అని సెట్ చేస్తే ఫోటోలు మరియు వీడియోలు వాట్సాప్ లో కనపడుతాయి కానీ ఫోన్ మెమొరీలోకి రావు.  

ఈ ఆప్షన్ ఏ గ్రూప్ కు ఆ గ్రూప్ ప్రత్యేకంగా ఉంటుంది. మనం నో అని పెట్టిన గ్రూపువి మాత్రమే కనిపించవు. మిగిలినవి అవుపిస్తాయి. దీని ద్వారా మన ఫోన్ స్టోరేజి ఆదా అవుతుంది. ఫోన్ లోకి రావు కాబట్టి డిలేట్ చేసుకునే బాధ తప్పుతుంది.