WhatsApp: వాట్సాప్‌లోకి వస్తోన్న కస్టమ్ ఏఐ చాట్‌బాట్‌!

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు నిత్యం ఉపయోగపడే కమ్యూనికేషన్ యాప్‌లలో వాట్సాప్ అగ్రస్థానంలో నిలుస్తోంది. మెటా యాజమాన్యంలో ఉన్న ఈ యాప్ తన వినియోగదారుల కోసం తరచూ కొత్త ఫీచర్లను అందిస్తూ ముందంజలో ఉంది. తాజాగా ఈ యాప్ కృత్రిమ మేధస్సు ఆధారిత (AI) విప్లవాత్మక ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు తామే తాముగా కస్టమ్ చాట్‌బాట్‌లను తయారు చేసుకునే అవకాశాన్ని పొందనున్నారు. ఇది వారి వ్యక్తిత్వం, అభిరుచుల ఆధారంగా రూపుదిద్దుకోవచ్చు. తాము అనుకున్నదాన్ని ప్రోగ్రామ్‌ చేయగలిగేలా డిజైన్ చేయబడిన ఈ బోట్లు వినియోగదారుల అనుభవాన్ని మరింత ఇంటరాక్టివ్‌గా మలచనున్నాయి.

ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌ వంటి ఇతర మెటా యాప్‌లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా, వాట్సాప్‌లో మాత్రం బీటా టెస్టర్లకు మాత్రమే ప్రస్తుతానికి లభ్యమవుతోంది. బీటా దశలో విజయవంతంగా పరీక్షలు పూర్తయిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా ఫ్రెండ్స్‌ మధ్య చిట్‌చాట్ మాత్రమే కాకుండా, వ్యక్తిగత సహాయకుల్లా ఉండే బోట్లు, సమాచారం ఇవ్వగలిగే టెక్ అసిస్టెంట్లు, వినోదాత్మక పాత్రలు వంటి ఎన్నో ప్రయోగాలు సాధ్యపడనున్నాయి. ఇది డిజిటల్ ప్రపంచంలో వ్యక్తిగతీకరణకు మరో అడుగు అనే చెప్పాలి. ఇప్పుడు ఈ ఫీచర్‌లో ఏ సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయో తెలియాలంటే ఇంకొంచెం వేచి చూడాల్సిందే.

జగన్ అంటే రౌడీయిజం || Social Activist Sharmila EXPOSED Ys Jagan Family || Ys Avinash Reddy || TR