వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ లను చదవాలని అనుకుంటున్నారా.. పాటించాల్సిన ట్రిక్స్ ఇవే!

ప్రస్తుతం ఎక్కువమంది ఉపయోగిస్తున్న యాప్ ఏదనే ప్రశ్నకు ఎలాంటి సందేహం లేకుండా వాట్సాప్ యాప్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. వాట్సాప్ యాప్ వల్లే ఎన్నో పనులు సులభం అవుతున్నాయని చాలామంది భావిస్తారు. వాట్సాప్ యాప్ లో ఎవరైనా మెసేజ్ పంపి మెసేజ్ డిలీట్ చేస్తే ఆ మెసేజ్ చదవలేమనే సంగతి తెలిసిందే. అయితే అలా డిలీట్ చేసిన మెసేజ్ లను సైతం సులువుగా చదివే ఛాన్స్ ఉంటుంది.

ఆండ్రాయిడ్ 11, అంతకంటే అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ వెర్షన్లతో ఉన్న ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి నోటిఫికేషన్ల ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెట్టింగ్స్ లో నోటిఫికేషన్స్ హిస్టరీ ఆప్షన్ ను క్లిక్ చేసి స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ను ఆన్ చేయడం ద్వారా నోటిఫికేషన్‌ల హిస్టరీకి వెళ్లి గత 24 గంటల్లో డిలీట్ అయిన మెసేజ్ లను చూడవచ్చు.

వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగించే వాళ్లకు మాత్రం ఈ ఫీచర్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ సహాయంతో సైతం డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్ లను చదివే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే థర్డ్ పార్టీ యాప్స్ అంత సేఫ్ కాదని ఈ తరహా యాప్స్ వల్ల ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

వాట్సాప్ యాప్ ను వినియోగించుకునే వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. వాట్సాప్ యాప్ ను ఎక్కువగా ఉపయోగించే వాళ్లకు ఈ ట్రిక్స్ బెస్ట్ ట్రిక్స్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.