ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అలాగే వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే పలు రకాల ఫీచర్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే వాట్సాప్ సంస్థ తాజాగా వినియోగదారులకు మన శుభవార్తను తెలిపింది. అదేమిటంటే..
వాట్సాప్ కాల్స్ కోసం నావిగేషన్‌ను మెరుగుపరచడానికి రూపొందించిన కొత్త ఆడియో కాల్ బార్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్.. యాప్‌లో అవుట్‌గోయింగ్ ఆడియో కాల్‌లను పెంచేందుకు యూజర్లకు మరింత కంట్రోల్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కాల్ కనెక్ట్ చేసిన తర్వాత యూజర్ కాల్‌ను క్రియేట్ చేసిన తర్వాత రీస్టోర్ చేసిన కాల్ బార్ ఇంటర్‌ఫేస్ పైన కనిపిస్తుంది. అవుట్ గోయింగ్ కాల్ ను కంట్రోల్ చేసేందుకు సులభమైన యాక్సస్ అందిస్తుంది. అయితే గత వెర్షన్ మాదిరిగా కాకుండా యూజర్లు కాల్‌కి తిరిగి రావడానికి గ్రీన్ స్టేటస్ బెల్ట్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
కొత్త కాల్ బార్ ఈ ప్రాసెస్ క్రమబద్ధీకరిస్తుంది. యూజర్స్ ఇప్పుడు కాల్ బార్ నుంచి నేరుగా కాల్‌ను మ్యూట్ చేయవచ్చు. కాల్ స్క్రీన్‌కి తిరిగి నావిగేట్ చేయాల్సిన అవసరాన్ని నివారిస్తుంది. దాంతో టైయింగ్స్ సేవ్ చేయవచ్చు. ఈ ఫీచర్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.