హైదరాబాద్ రోడ్లంటే ప్రజలు భయపడుతున్నారని, వర్షాలొస్తే జీవితం ఇక్కడ దుర్బరమవుతున్నది, నాలుగేండ్ల టిఆర్ ఎస్ ప్రభుత్వం నగరాన్ని నాశనం చేసిందని కాంగ్రెస్ ఈ రోజు రోొడ్డెక్కింది.
నగరాన్ని డల్లాస్ చెేస్తామని ,ఇస్తాంబుల్ లాగా మారుస్తామని, సింగపూర్ లో తళతళలాడిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ రాజధానిలో మనుషులు, వాహనాలురోడ్ల మీద తిరగకుండా గుంతలమయం చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
ముఖ్యమంత్రి ఇంటి ప్రగతి భవన్ నిగనిగలాడటం హైదరాబాద్ గతుకుల మయం అయిందని పార్టీ సిటి కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంంలో నేడు ధర్నా నిర్వహించింది. అయితే, పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
అధ్వాన్నమయిన పరిస్థితికి నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం పట్ల పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ అరెస్టు ను ఆయన ఖండించారు.
‘హైదరాబాద్ లో రోడ్డు లేవు, ఉన్నవన్నీ అన్ని గుంతలమయం. అద్వాన్నంగా మారిన రోడ్లతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. నిరసన తెలపడానికి నగర్ కాంగ్రెస్ అధ్యక్ష్యుడు అంజన్ కుమార్ యాదవ్ పిలుపు ఇస్తే అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లో పెట్టారు. ప్రజాస్వామ్యం లేకుండా కెసిఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. ప్రజలు తిరగబడే రోజులు వస్తున్నాయి,’ అని హెచ్చరించారు.ధర్నాకు నాయకత్వం వహించిన అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ‘ఇస్తాంబుల్ లేదు, గిస్తాంబుల్ లేదు. డల్లాస్ అసలూ లేదు. కేవలం సీఎం కేసీఆర్ నివాసం ముందు మాత్రమే రోడ్లు బాగున్నాయి. నిరసన తెలిపితే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు,’ అని అన్నారు. కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇంత అధ్వాన్నంగా రోడ్లు ఎపుడూ గతంలో దిగజారలేదని, గతుల రోడ్ల మీద ఆసుపత్రికి వెళ్తూ అకాల ప్రసవాలయినట్లు కూడా తనకు తెలిసిందని అన్నారు…