నేనున్నా, వూరికూరికే భయపడకు పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

తనను చంపేందుకు కుట్ర జరుగుతూ ఉందని, కుట్రదారులు మాట్లాడుతుకున్న ఆడియో క్లిప్ తనకు వచ్చిందని పవన్ రెండు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయం బాగా చర్చనీయాంశమయింది.

వీడియో క్లిప్పింగ్ ఉందన్నారు తప్ప దానిని వినిపించలేదు. అంత ప్రమాదకరమయిన సంభాషణ ఉన్నపుడు అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరో చెప్పలేదు. ప్రాణహాని ఉన్నపుడు ఈ విషయం బయట పెట్టకుండా కేవలం నాదగ్గిర ఆడియో క్లిప్ ఉందని వదిలేయడం సబబా అనేది హాట్ టాపిక్ అయింది.

దీని మీద పోీలీసులతో పాటు ముఖ్యమంత్రి కూడా నేడు స్పందించారు.

 ఈ రోజు తాడేపల్లిగూడెం ధర్మపోరాట సభలో మాట్లాడుతూ ఆయన పవన్ కు అభయమిచ్చారు.   ప్రాణహాని ఉందంటూ గురువారం ఏలూరు సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పత్యేకంగా  ప్రస్తావిస్తూ  ఫిర్యాదు చేస్తే  భారీ భద్రత కల్పిస్తామని చంద్ర బాబు  హామీ ఇచ్చారు.

 సమాచారం ఇవ్వకుండా విమర్శించడం మంచిదికాదని, అలా చేస్తే అదొక  విమర్శగానే ఉండిపోతుందని  దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

‘అనవసరంగా భయపడొద్దు.  ఏపీలో స్వచ్ఛమైన  నీతివంతమైన పాలనను తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్నది. మీ భద్రతకే డోకా లేదు,ై అని చెప్పారు.