మురళీ మోహన్  వినూత్న సేవ

రాజకీయాలంటేనే ప్రజలకు సేవ చేయడం. కానీ ఇవ్వాళ రాజకీయాలు అలా లేవు. డబ్బు సంపాదనే రాజకీయం అయిపొయింది. నాయకులు  ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. మళ్ళీ  పది రేట్లు సంపాదించుకుంటున్నారు .

అయితే   తాను మాత్రం ప్రజాసేవకు తప్ప సంపాదన కోసం రాజకీయాలోకి రాలేదని చెబుతున్నారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మురళి మోహన్.

ఆర్టిస్టుగా, బిల్డరుగా తానూ బాగా సంపాదించానని, ఏ  ప్రజల ఆదరాభిమానాలతో ఈ స్థాయికి ఎదిగానో ఆ ప్రజలకు సేవ చెయ్యడానికే రాజకీయ రంగంలోకి వచ్చానని,  తన నియోజక వర్గంలో  అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను చేయిస్తున్నానని తెలిపారు.

సినిమా రంగంలో మహా నటుడు ఎన్టీ రామారావు ట్యాంకు ఆదర్శమని, అలాగే రాజకీయాల్లో స్ఫూర్తి నిచ్చింది చంద్ర బాబాబు అని మురళి మోహన్ తెలిపారు.

రాజమండ్రి ప్రజలకోసం  ఒక కాన్సర్ ఆంబులెన్సు ను తయారు చేశామని, దీని తన ఎంపీ  నిధుల నుంచి  కోటి 75 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్టు చెప్పారు. కాన్సర్ రోగులను దృష్టిలో పెట్టుకొని దీనిని రూపొందించామని ఆయన చెప్పారు .

మారుమూల పల్లెలకు కూడా ఈ అంబులెన్సు వెడుతుందని, ఇందులో  డాక్టర్తో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపాడు. ఈ వాహనాన్ని చంద్ర బాబు మెచ్చుకున్నారని మురళి మోహన్ చెప్పాడు.