సినీనటుడు, బిజెపి మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు అరుదుగా మాట్లాడతాడు. మంత్రిగా ఉన్నపుడు కూడా ఆయన మాట్లాడింది అరుదు. పార్లమెంటులో ఎపుడు మాట్లాడారో ఎవరికి గుర్తులేదు. రాజకీయాల్లో ఉన్నపుడే మాట్లాడని వ్యక్తి, రాజకీయాల్లో కనుమరుగయ్యాక ఏమ్మాట్లాడతారు.
అయితే, ఆయనిపుడు మీడియా కెక్కారు.
చంద్రబాబు మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్న పోరాటంలో కి కృష్ణంరాజు కూడా దూకారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్రంగా దాడి చేశారు.
ఈ రోజు విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి పాపం పండేరోజు రానుందని చెప్పారు.
‘‘ పోలవరం ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగింది. నిర్వాసితుల పునరావాసం.. కాపర్ డ్యాంనిర్మాణంలో అవినీతి తారా స్థాయిలో జరిగింది. పాపం పడితే అన్నీ బయటకు వస్తాయి,’ అని అన్నారు.
‘‘టీడీపీ మిత్రపక్షం అని కళ్ళకు గంతలు కట్టుకున్నాము కాబట్టే టీడీపీ మోసాలు చూడలేకపోయాం,’’ అని తీవ్రమయిన వ్యాఖ్య చేశారు.
అంతేకాదు, ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు అబద్ధాలడుతున్నారని ఆరోపిస్తూ ‘‘ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజి కావాలని ఆడిగిందే చంద్రబాబు,’’ అని కూడా చెప్పారు.
తెలుగుదేశం పార్టీ మోదీ మీద చేస్తున్న దాడిని ఆయనతిప్పకొట్టే ప్రయత్నం చేశారు. గుజరాత్ లోని దోలెరా ప్రాజెక్టుకు 80 వేల కోట్లు ప్రధాని మోదీ ఇచ్చారని ఇక్కడి టీడీపీ వారు అసత్య ప్రచారం చేస్తున్నారు.. అక్కడి ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగంగా ఈ దోలెరా ను అభివృద్ధి చేసుకుంటున్నారు. మరి చంద్ర బాబు ఏమిచేస్తున్నారు? కేంద్రం నుండి తీసుకున్న డబ్బులను సరిగా సద్వినియోగం చేయకపోవడే టమే కాకుండా వాటికి లెక్కలు కూడా చూపించలేకపోతున్నారు,’’ అని అన్నారు.
ప్రపంచ దేశాలన్నీ మోడీ వైపు చూస్తున్నాయి..దేశ ప్రజలు మోడీ పాలన కోరుతున్నారు. మోడీ రాజనీతి కోవిదుడు అంటూ ప్రధానిని ఆకాశానికి ఎత్తుతూ రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మోడీ పేరు వల్ల బిజెపికి 20 ఎంపీ సీట్లు వస్తాయని కృష్ణంరాజు చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
*2019 ఎన్నికల్లో నేను పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు..
*మోడీ తెలుగు ప్రజలకు అన్యాయం చేశారు అన్న టీడీపీ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు ప్రయత్నిస్తారు.
*విశాఖ రైల్వే జోన్ కొన్ని ప్రత్యేక కారణాలతో ముడి పడి ఉంది…
*జనాలను చూసి ఓట్లు వస్తాయని అనుకోవటం కరెక్ట్ కాదు.. నాయకుల మీటింగ్ లకు జనాలు వచ్చినంత మాత్రాన ఓట్లు రావు
*రాష్ట్రంలో ని13 జిల్లాలు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుంటా..
*ఇప్పటి వరకు5 జిల్లాలు పర్యటించాను. శ్రీకాకుళం.. అనంతపురం..
* 40 సంవత్సరాలు దాటాక రాజకీయాల్లోకి వచ్చాను. ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదు..