యాక్షన్ థ్రిల్లర్ ‘ట్యాక్సీ’రివ్యూ.. కథ మాములుగా లేదుగా!

పరిచయం అయ్యే దర్శకుల కథ,కథనం కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తూంటారు. అయితే ఆ కథలు ఫార్మెట్ కు భిన్నంగా ఉండి, ఎంగేజింగ్ గా ఉంటేనే ఆదరణ పొందుతూంటాయి. ఈ చిత్రం ట్రైలర్ నుంచే ఆసక్తి క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది. టాక్సీ ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. టెక్నాలిజీ, వాటిని అడ్డం పెట్టుకుని చేసే మోసాలు నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ అని ట్రైల‌ర్ చూస్తున్న‌ప్పుడే అర్ధమైయింది. ద‌ర్శ‌క నిర్మాత‌లూ ఇదే చెప్పారు. కాక‌పోతే… అంతకు మించిన పాయింట్ ఈ సినిమాలో ఇంకోటి ఉంద‌న్నట్లు వినపడింది. మరింత‌కీ టాక్సీ కథ ఏంటి ? ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

కథ

సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. దాన్ని దేశం కోసం ఉపయోగించాలనుకుంటాడు. కాలిఫోర్నియం 252 తో బంగారం నిల్వలు కనిపెట్టవచ్చు. ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న బంగార నిల్వల అంతు తేల్చచ్చు. అప్పుడు మన దేశం నెంబర్ వన్ అవుతుంది అని గనుల శాఖా మంత్రి ముందు ప్రపోజల్ పెడతాడు. మరిన్ని ప్రయోగాలు కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము 180 కోట్లు. అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారు. పొలిటీషన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది. ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడుని వంచటం కష్టం. అందుకే అతని పర్శనల్ లైఫ్ ని తమ గుప్పిట్లో తీసుకుంటే అనే ఆలోచన వస్తుంది. అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య (అల్మాస్ మోటివాలా) మిస్సింగ్ లు జరిగిపోతూంటాయి. వాటి నుంచి ఈశ్వర్ తప్పించుకోవటానికి తన వంతు ప్రయత్నం మొదలెడతాడు.

మరో ప్రక్క ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కెరీర్ పరంగా ఎదటానికి మంచి కాంట్రాక్ట్ వస్తుంది. దాంతో స్నేహితులు,సన్నిహితులు నుంచి అప్పులు చేసి తెచ్చి మరీ తన సంస్దను డవలప్ చేస్తూ పై మెట్టు ఎక్కాలనుకుంటాడు. కానీ అనుకోని విధంగా తనకు వచ్చిన కాంట్రాక్ట్ సమస్యల్లో పడటం, ప్రాజెక్టు ఆగిపోవటం, చివరకు అప్పులు మిగలటం జరుగుతుంది. ఆ ఫైనాన్సియల్ ప్రెజర్ తట్టుకోవటానికి అతను ఓ డెసిషన్ తీసుకుంటాడు. ఇలా వేర్వేరు సమస్యలతో ఉన్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోని పరిస్దితుల్లో ఓ క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు. వాళ్లనుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుసుకుంటాడు. అతనెవరు..వీళ్లిద్దరని టార్గెట్ చేయటానికి కారణం ఏమిటి… ఎటాక్ జరిగిన తర్వాత నుంచి వాళ్ల జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి. మిస్సైపోయిన ఈశ్వర్ భార్యతిరిగి కనపడిందా..అతనిపై పడిన పోలీస్ కేసులు,నేరారోపణలు చివరకు ఏమయ్యాయి ..ఈ కథలో టాక్సీ డ్రైవర్ ( సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది:

సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు కామన్ గా అనుమానాస్పద మృతి లేదా యాక్సిడెంట్ లతో మొదలౌతాయి. టాక్సీ కథని కూడా ఒక మిస్టరీ తో మొదలుపెట్టారు దర్శకుడు. హీరో మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేస్తూంటారు. ఆ తర్వాత ఓ ఎథికల్ హ్యాకర్ వచ్చి ఈ కథలో జాయిన్ అవుతారు. దాంతో ఈ రెండికి మధ్య లింక్ వుందని ప్రేక్షకుడి అర్ధమౌతుంది. ఒక పక్క మిస్టీరికు విచారణ మరో పక్క హ్యాకర్ చుట్టూ జరిగే కథ. రెండు కథలు సమాతంరంగా నడుస్తుంటాయి. ఈ రెండికి మధ్య కామన్ లింక్ వుందని తెలిసినప్పుడు కథనంను ఉత్కంఠభరితంగా నడపాలి. అలా చేయకపోతే కథనం మాత్రం రక్తికట్టదు. కానీ దర్శకుడు అక్కడే సక్సెస్ అయ్యాడు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా టైట్ స్క్రీన్ ప్లే తో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా టెన్స్ నరేషన్ తో పరుగెడుతుంది. ఐతే సెకండ్ హాఫ్ లో కొంతమేర మొమెంటం మిస్ అయింది. ఒక దశ దాటాక మళ్లీ స్పీడు అందుకుంటుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ తరహాలో ఉండి ఉంటే కచ్చితంగా హంట్ మరింత ఎఫెక్టివ్ సినిమా అయ్యుండేదని మనంకు అనిపిస్తుంది. అలాగే సినిమా క్లైమాక్స్ కూడా ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.

ముఖ్యంగా సినిమాలోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. చిన్న సినిమాకు కూడా పెద్దగా వర్క్ చేసారు. ‘ లవ్ స్టొరీ ‘ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బి జె శ్రీధర్ ఈ చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేయటం కలిసివచ్చింది. ఫైట్ సీక్వెన్స్ లు నెక్ట్స్ లెవిల్ లో ఉన్నాయి . థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందించాలనే తాపత్రయంతో చేసిన కొన్ని లవ్ సీక్వెన్స్ లే విసిగిస్తాయి.

టాక్సీ ఎక్కిన ఇద్దరి వ్యక్తుల జీవితాలను వారి గతం ఎలా వెంబడించింది…ఒకరికొకరు తెలియకుండా టాక్సీ ఎక్కినా…వాళ్లిద్దరు ఒకరికొకరు ఎలా ఇంటర్ లింక్ అయ్యి ఉన్నారు వంటి ఆసక్తికరమైన ట్విస్ట్ లు రాసుకుని ఈ దర్శకుడు తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ వరకు హీరోని సమస్యలో పడేయటం….. సెకండ్ హాఫ్ లో ఆ సమస్యనుంచి బయిటపడటానికి అతను ఏం ప్రయత్నం చేసాడు..ఎలా తన సమస్యలను అధిగమనించాడు అన్న థోరణిలో స్క్రీన్ ప్లే రాసుకున్నారు.

నటీనటులు:

హీరాగా చేసిన వసంత్ సమీర్ పిన్నమ రాజు… పెర్ఫార్మన్స్ బాగుంది. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మెప్పిస్తుంది. అతని భార్య పాత్రలో అల్మాస్ మోటివాలా పాత్ర కూడా బాగుంది. తను క్యూట్ గా చేసింది. సౌమ్య మీనన్ కీలకమైన పాత్రలో మెప్పిస్తుంది. ఇక ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్ వేర్వేరు పాత్రలలో పర్వాలేదనిపిస్తాడు.

టెక్నికల్ :

దర్శకుడు హరీష్ చిన్న చిన్న ట్విస్ట్ లతో ఆసక్తికర కథనే అందించాడు. అలాగే ఇంప్రెసివ్ వే లోనే కథను ముందుకు తీసుకెళ్లాడు. అలాగే స్టోరీని ఈజీగా గెస్ చేసేలా ఉంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.అయితే ఇలాంటి కథకు అవసరమైన భారీతనం లోపించింది అనిపిస్తుంది. ఇక కథతో మిళితమయ్యే పాటలు ఇచ్చాడు మార్క్ k రాబిన్. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుంది. ఎడిటింగ్ ఓకే. సినిమాటోగ్రఫీ కూడా బాగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఆల్ రైట్. డైలాగులు చక్కగా రాసుకున్నారు.

ఫైనల్ గా…

కథ కానీ నరేషన్ కానీ ఇప్పటికే మనం వందలాది సినిమాల్లో చూసిన దానికి భిన్నంగా ఉంటుంది. ప్రతీ సీన్ ముందే ఏం జరుగుతుందో ఊహించేసిన ప్రతీసారి డైరక్టర్ దెబ్బ కొడ్తారు. ఇంట్రస్టింగ్ నేరేషన్ తో సాగే థ్రిల్లర్.

బ్యానర్: హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్

నటీనటులు: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు.

సంగీతం : మార్క్ k రాబిన్

సినిమాటోగ్రఫీ : ఉరుకుండారెడ్డి

విఎఫ్ఎక్స్ : ఆనంద్ పల్లకి

ఎడిటర్: టి.సి.ప్రసన్న

దర్శకత్వం: హరీష్ సజ్జా

నిర్మాత: హరిత సజ్జా

విడుదల తేదీ:10, మార్చి 2023.

రేటింగ్: 2.75/5