6 Journey Review: పాకిస్తాన్ తీవ్రవాదం మీద భారత్ ఉక్కుపాదం మోపుతోంది. ఈ తరుణంలో చైనా తీవ్రవాదం మీద రూపొందిన ‘6 జర్నీ’ సినిమా నేడు థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే…
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన సినిమా ‘6 జర్నీ’. పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రమిది. బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మించారు. మే 9న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందంటే?
ప్రాణాలు తీసిన ఫోన్ కాల్స్…
గోవా వెళ్లాల్సిన బ్యాచ్ కిడ్నాప్!
హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ మర్డర్స్ జరుగుతాయి. ఒక ఫోన్ వచ్చిన వెంటనే కొంతమంది చెవిలో నుంచి రక్తం కారి మరణిస్తారు. మరోవైపు సెల్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే గవర్నమెంట్ ఆఫీసర్స్ కిడ్నాప్ అవుతారు. సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆరుగురు యువతీయువకులు (రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి & కో) గోవా ప్రయాణం అవుతారు. జర్నీలో ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగితే ఇస్తారు. డిఫరెంట్ ప్యాటర్న్ మర్డర్స్ అతడు చేశాడని డౌట్ కలుగుతుంది. సైకో నుంచి తప్పించుకొనే క్రమంలో తీవ్రవాదులు ఆరుగురితో పాటు అతడిని కూడా కిడ్నాప్ చేస్తారు.
టెర్రరిస్టుల డిమాండ్ ఏమిటి? ఫోన్ వచ్చిన వెంటనే కొందరు ఎలా మరణించారు? అందుకు కారణం ఏమిటి? తీవ్రవాదుల నుంచి రాబోయే ముప్పును ఆ ఆరుగురు ఎలా ఎదుర్కొన్నారు? ఆ సైకో అసలు రూపం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ
తీవ్రవాదం ప్రస్థానం వచ్చిన ప్రతిసారి చాలామంది వేళ్ళు పాకిస్తాన్ వైపు చూపిస్తాయి. అయితే చైనా తీవ్రవాదం గురించి సిక్స్ జర్నీ సినిమాలో చూపించారు. తీవ్రవాదం అంటే తుపాకీ పట్టి చేసేది మాత్రమే కాదని టెక్నాలజీ పరంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్త పుంతలు ఎలా తొక్కుతుందనేది ఈ సినిమాలో చూపించారు.
దర్శకుడు బషీర్ ఆలూరి ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది ఆయన ఇప్పటివరకు తీవ్రవాదం నేపథ్యంలో టాలీవుడ్ స్క్రీన్ మీద రాని కొత్త కథ చెప్పారు అయితే ఆ కథను అంతే ఎఫెక్టివ్ గా స్క్రీన్ మీదకు తీసుకురావడంలో కాస్త తలబాటుకు గురి అయ్యారు. సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా మర్డర్ చేయడం ఏమిటి అనేది ఆసక్తిగా ఉంటుంది. ఆ తరువాత ఆరుగురిని పరిచయం చేయడం, ఆ ట్రావెలింగ్ ఎపిసోడ్స్ రెగ్యులర్ సినిమాల్లో చూసినట్టే ఉంటాయి. లవ్ స్టోరీస్ కామెడీ ఎపిసోడ్స్ సాధారణ సినిమా ఫీలింగ్ ఇచ్చినా... హత్యలు చేసింది లిఫ్ట్ అడిగిన వ్యక్తి అని అనుమానం వచ్చిన తర్వాత కొంచెం టెన్షన్ క్రియేట్ అవుతుంది. దేశభక్తి మీద హిందూ ముస్లిం క్రిస్టియానిటీ మీద రాసిన డైలాగులు బాగున్నాయి. ప్రేమ కథలో కామెడీలో అదే కొత్తదనాన్ని చూపించుంటే బాగుండేది.
దర్శకుడు బషీర్ ఆలూరి తీసుకున్న కాన్సెప్ట్ బాగున్న ఎగ్జిక్యూషన్ పరంగా కొంత తడబాటుకు గురయ్యారు. ఆర్టిస్టులలో మెజారిటీ జనాలు కొత్తవాళ్లు కావడం కూడా సినిమాకు కొంత మైనస్ అయింది అయితే నిర్మాత కొత్త వాళ్ళ మీద ఖర్చుపెట్టి తీశారు.
హీరోగా పరిచయమైన రవి ప్రకాష్ రెడ్డి తన పాత్ర వరకు న్యాయం చేసేలా నటించారు. అయితే ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముగ్గురు అమ్మాయిలలో ఇద్దరు కొన్ని సన్నివేశాలలో పాటల్లో గ్లామర్ వలకబోసారు. టేస్టీ తేజ నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా నటీనటుల్లో పేరు ఉన్న ఆర్టిస్టులు లేరు. సీజనల్ స్టార్ కాస్ట్‌ను ఎంపిక చేసుకునే ఉంటే బాగుండేది. దేశభక్తి నేపథ్యంలో సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులను కొంతవరకు సాటిస్ఫై చేసే సినిమా సిక్స్ జర్నీ. ఇండో పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను నేపథ్యంలో కరెంటు మూడ్ రిప్రజెంట్ చేసే సినిమా ఇది.
రేటింగ్: 3/5