భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. హైదరాబాద్ కంచన్ బాగ్ యూనిట్ వేర్వేరు విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ నెల 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఈసీఈ, డీసీసీపీ, సివిల్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 38 ఉండగా డిప్లొమా అప్రెంటీస్ 37 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 2025 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యొగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 9000 రూపాయల వేతనం లభించనుండగా డిప్లొమా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 8000 రూపాయల వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. https://bdl-india.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవాలంటే సమీపంలోని సంస్థ బ్రాంచ్ లను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరగనుంది.